Gold Price Today : ఎంత చల్లటి కబురు.. బంగారం ఇక అందుబాటులోకి వచ్చినట్లేనా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గాయి;

Update: 2024-11-27 03:30 GMT

బంగారం ధరలు ఎప్పుడూ పైపైకి చూస్తుంటాయి. ధరలు పెరగడమే తప్పించి తగ్గడం అనేది బంగారం విషయంలో చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే బంగారం, వెండికి ఉన్న డిమాండ్ అలాంటిది. బంగారం, వెండి వస్తువులను స్టేటస్ సింబల్ గా భావించి కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ధరలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. డిమాండ్ కు తగినట్లు బంగారం నిల్వలు లేకపోవడం కూడా ధరల పెరుగుదల కు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే గత కొన్నేళ్లలో బంగారం, వెండి ధరలను పరిశీలించిన వారికి ఎంతగా పెరిగాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకే బంగారం కొనుగోళ్లు మాత్రం ఇంకా ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి.

సురక్షితమైన పెట్టుబడి...
బంగారంపై పెట్టుబడి పెడితే దానిని సురక్షితమైనదిగా భావిస్తారు. సులువుగా తమకు అవసరమైన సమయంలో నగదుగా మార్చుకునే వీలు ఒక్క బంగారం విషయంలోనే సాధ్యమవుతుంది. తరుగు వంటివి తీసేసి మన డబ్బులు మనకు తిరిగి వస్తాయి. మన అవసరాల కోసం బంగారం ఆదుకుంటుందన్న భావన ప్రజల్లో బలంగా పడిపోయింది. అందుకే వీలున్నప్పుడల్లా, అవసరం లేకపోయినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. ఇక శుభకార్యాలు ఇంట్లో ఉంటే చాలు బంగారాన్ని కొనుగోలు చేయకుండా అస్సలు ఉండరు. విదేశాల్లో మాదిరిగా గోల్డ్ బాండ్స్ వైపు ఇక్కడ చూడటం అరుదు. కేవలం ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేస్తుంటారు.
భారీగా తగ్గి...
అందుకే దక్షిణ భారత దేశంలో వీధికొక కార్పొరేట్ జ్యుయలరీ దుకాణం వెలిసింది. అనేక ఆఫర్లతో ప్రతి రోజూ పసిడి ప్రియులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తూనే ఉంటారు. తరుగులో తగ్గింపుతో పాటు బంగారం కొనుగోలు చేస్తే వెండి ఫ్రీ అనే ఆఫర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇలా అనేక రకాలుగా వినియోగదారులను రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు కొంత వరకూ ఫలిస్తున్నాయని చెప్పాలి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గాయి. గత మూడు రోజుల నుంచి పది గ్రాముల బంగారం ధరపై దాదాపు 2,500 రూపాయలు తగ్గింది. అలాగే కిలో వెండి ధరపై 2,600 రూపాయలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,790 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,230 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 97,900 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News