Kerala : కేరళ ఐపీఎస్ సస్పెన్షన్… తెలంగాణ మంత్రి అంటూ గతంలో?

కేరళ ఐపీఎస్ లక్ష్మణ్ నాయక్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయక్ కేడర్ లో ట్రాఫిక్ డీఐజీగా విధులు నిర్వహించేవారు. మోన్సన్ [more]

Update: 2021-11-10 12:55 GMT

కేరళ ఐపీఎస్ లక్ష్మణ్ నాయక్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయక్ కేడర్ లో ట్రాఫిక్ డీఐజీగా విధులు నిర్వహించేవారు. మోన్సన్ మవున్ కల్ తో లక్ష్మణ్ నాయక్ సంబంధాలున్నట్లు గుర్తింాచరు. ప్రస్తుతం ఐజీ కేడర్ లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు చీఫ్ సెక్యూరీటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. గతంలోనూ లక్ష్మణ్ నాయక్ పై అనేక ఆరోపణలు వచ్చాయి.

అనేక ఆరోపణలు…

లక్ష్మణ్ నాయక్ పై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 1997 బ్యాచ్ కు చెందిన లక్ష్మణ్ నాయక్ తెలంగాణలో మంత్రిగా కూడా అవుతారని గతంలో ప్రచారం జరిగింది. ఆయనను కేసీఆర్ మంత్రిని చేస్తారన్న ప్రచారం రావడంతో ఆయన పేరు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగింది.

Similar News