అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు హతమార్చడం వెనక స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు ప్రకటన చేయకపోవడంతో రాజకీయంగా ఈ జంట హత్యలపై అనే అనుమానాలు తలెత్తాయి. కిడారి సర్వేశ్వరరావును పక్కా వ్యూహంతోనే మావోయిస్టులు హతమార్చారన్నది పోలీసు విచారణలో వెల్లడవుతుంది.
కిడారి కార్యక్రమాలను తెలుసుకునేందుకు.....
ఎమ్మెల్యే కిడారి సోమేశ్వరరావు అధికారిక కార్యక్రమాలను తెలుసుకునేందుకు ఆయన సన్నిహితులే మావోయిస్టులు వాడుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీ కిడారి ఆనుపానులను మావోలకు అందించారని పోలీసులు ఒక అభిప్రాయానికి వచ్చారు. కిడారి ఎప్పుడు? ఎక్కడకు వస్తున్నారన్న విషయం మావోయిస్టులు ఆ ఎంపీటీసీ ద్వారానే తెలుసుకున్నారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది.
రెండు నెలల నుంచే......
కిడారిని హతమార్చాలని దాదాపు రెండు నెలలకు ముందుగానే మావోయిస్టులు ప్లాన్ చేశారు. అయితే కిడారి ఎప్పుడు? ఎక్కడకు? వస్తారన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆయన సన్నిహతుల్లో ఒకరి ఎంచుకున్నారని తెలుస్తోంది. ఆగస్టు నెలలోనే మావోయిస్టులు ఆ నేతను పిలిపించుకుని మాట్లాడినట్లు చెబుతున్నారు. మావోయిస్టుల వ్యూహంలో భాగంగానే కిడారిని గ్రామదర్శిని కార్యక్రమానికి ఆ ఎమ్మెల్యే ఆహ్వానించినట్లు పోలీసుల అనుమానం. దీనిపై విచారణ ఇంకా జరుగుతోంది. మొత్తం మీద నిన్న మొన్నటి వరకూ కిడారి హత్యపై ఉన్న అనుమానాలు ఒక్కొక్కటిగా తొలగిపోయే సూచనలు కన్పిస్తున్నాయి.