అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్ద విచారణ చేపట్టింది. హత్య జరిగిన నాలుగు నెలల తరువాత ఈ విచారణ మొదలు అవ్వడం విశేషం. మావోయిస్టుల ఘాతుకాలపైన జాతీయ దర్యాప్తు సంస్ద చేత విచారణ చేయించాలని గతంలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసును ఎన్ ఐఎ కి బదలీ చేయాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. దీంతో ఇప్పటికే కేసును విచారణ చేస్తున్న సిట్ నుంచి ఎన్ ఐఎ కు బదలీ చేస్తూ రాష్ట్ర పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. గత నాలుగు రొజుల నుంచి ఎన్ ఐఎ విచారణ చేస్తుంది. ఇప్పటికే అరకు , పాడేరు లో ఎన్ ఐఎ బృందాలు చేరుకున్నాయి. గతంలో ఎపి పోలీసులు అరెస్టు చేసిన వారిని కూడా తిరిగి తమ కస్టడీలోకి ఎన్ఐఏ తీసుకోనుంది.
కొందరిని అదుపులోకి తీసుకుని....
అదీగాక కిడారి, సొము అతి కిరాతంగా హత్య చేసిన మావోయిస్టులను పట్టుకునేందుకు ఇప్పటికే ఎన్ ఐఎ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అలాగే ఇప్పటికే నలుగురిని ఎన్ ఐఎ అరెస్టు చేసింది. ఇందులో సుబ్బారావు, శొభన్, ఈశ్వరి, కొర్ర కమల్ ను ఎన్ఐఏ తిరిగి అరెస్టు చేసింది. వీరిని త్వరలోనే విజయవాడ లోని ప్రత్యేక కొర్డులో హాజరు పర్చ బోతున్నారు. మరో పది మంది ఎన్ ఐఎ అదుపులో వున్నారు. వీరిని కూడా ఎన్ ఐఎ విచారిస్తుంది. ఇదిలా వుంటే దేశంలో ఎక్కడ మావోయిస్టుల ఘాతుకాలు జరిగిన కూడా వాటిని తప్పని సరిగా ఎన్ఐఏ చేత విచారించాలని ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. అంతేగాకుండా మావోయిస్టులు ఒక ప్రాంతం నుంచి వెళ్లి మరొక ప్రాంతంలో దాడులు చేసి వస్తుంటారు. ఈ నేపధ్యంలో ఒకే రాష్ట్రం పోలీసులు మరొక రాష్ట్రంలో వెళ్లి విచారణ చేయాలంటే కొన్ని ఇబ్బందులు కూడా వుంటాయి. అందుకనే మావోయిస్టుల చర్యలపైన ఎన్ఐఏ విచారణ ను తప్పని సరి చేసింది. పది రొజుల పాటుగా ఎన్ఐఎ పాడేరులోనే మకాం వేస్తుంది. అంతేగాకుండా చత్తీస్ గడ్ తో పాటుగా ఒడిషాల్లో కూడా ఈ హత్యలపైన విచారణ చేస్తుంది. ఏది ఏమైనప్పటికి కూడా కిడారి హత్య కేసులో రాజకీయ రంగు కాస్తా తొలగిపొయిందని అనుకొవచ్చు.