కొహ్లి సూపర్ షో... శ్రీలంక ముందు భారీ లక్ష్యం
భారత్ - శ్రీలంక మధ్య చివరి వన్డే మ్యాచ్ లో కొహ్లి సూపర్ సెంచరీ చేశారు. 156 పరుగులు చేశాడు. భారత్ కు భారీ స్కోరు లభించింది.
భారత్ - శ్రీలంక మధ్య చివరి వన్డే మ్యాచ్ లో కొహ్లి సూపర్ సెంచరీ చేశారు. 156 పరుగులు చేశాడు. భారత్ కు భారీ స్కోరు లభించింది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఇద్దరూ దూకుడు గానే ఆడారు. రోహిత్ అవుటయిన తర్వాత వచ్చిన విరాట్ కొహ్లి ఇక ఎక్కడా తగ్గలేదు. సిక్సర్లు, ఫోర్లతో తిరువనంతపురం స్టేడియాన్ని మోత పుట్టించాడు. 110 బంతుల్లో 166 పరుగులు చేశాడు.
భారీ లక్ష్యాన్ని...
యాభై ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి టీం ఇండియా 390 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే శ్రీలంక లక్ష్యం 391 పరుగులు చేయాల్సి ఉంది. శుభమన్ గిల్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 116 పరుగులు చేశాడు. బ్యాటర్లందరూ చెలరేగి ఆడటంతో మూడో వన్డేలోనూ భారత్ భారీ పరుగులు చేసింది. మరి బౌలింగ్ లో సత్తా చూపితే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేసే అవకాశముంది.