కోమటిరెడ్డి లేఖపై రెస్సాన్స్…. వారికి నోటీసులు

తుర్క యాంజల్ లో తులిప్స్ గ్రాండ్ హోటల్ పై హైకోర్టు కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖ కు స్పందించింది. హెచ్ఎండీఏ అనుమతి లేకుండా నిబంధనలకు [more]

Update: 2021-03-26 01:27 GMT

తుర్క యాంజల్ లో తులిప్స్ గ్రాండ్ హోటల్ పై హైకోర్టు కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖ కు స్పందించింది. హెచ్ఎండీఏ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా హోటల్ ను నిర్మించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిర్మించిన హోటల్ ను మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభించారని కోమటిరెడ్డి ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న కోమటిరెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. తులిప్స్ గ్రాండ్ హోటల్ యాజమాన్యాన్ని ప్రతివాదిగా చేర్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, తులిప్స్ గ్రాండ్ హోటల్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

Tags:    

Similar News