తాను హరీష్ రావు వర్గమని,అందుకే కేటీఆర్ టిక్కెట్ దక్కనివ్వలేదని టీఆర్ఎస్ నాయకులు కొండా సురేఖ ఆరోపించారు. మంగళవారం వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ పాలనపై, పాలనా వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఆయన కుటుంబం తప్ప ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధిస్తూ కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
- సోనియా గాంధీ, రాహుల్ గాంధీని నాలుగు కలవాలంటే నాలుగు గంటలు నిలబడాలని కేసీఆర్ అన్నారు. నాలుగు గంటలైనా వారి అపాయింట్ మెంట్ దొరుకుతుంది. కనీసం నాలుగేళ్లయినా కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకదు.
- మా నాన్న చనిపోతే కేసీఆర్ రాలేదు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు తండ్రి చనిపోతే వచ్చి ఆయనను కలిశారు. ఇది దొరల అహంకారం కాదా. నేను బీసీ మహిళను అయినందుకే మాపైన చిన్న చూపా..?
- అధికారం కోసం, స్వలాభం కోసం మేము ఏనాడు పార్టీలు మారలేదు. మాకు కారణం చెప్పకుండా టిక్కెట్ ఇవ్వకుండా నమ్మకద్రోహం చేశారు.
- వేల కోట్ల అవినీతితో కల్వకుంట్ల ఖజానా నిండిపోయిందనేది వాస్తవం కాదా..? కేటీఆర్ అవినీతి, హైదరాబాద్ లో ఆయన చేస్తున్న సెటిల్ మెంట్లు, కాంట్రాక్టర్ల దగ్గర తీసుకుంటున్న కమిషన్ వివరాలు చెప్పగలరా...?
- ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగుల సమస్యలు తీర్చలేని అసమర్థ పాలన కేసీఆర్ ది కాదా..?
- కేవలం ప్రగతి భవన్, ఎర్రవల్లి ఫామ్ హౌజ్ పచ్చగా ఉంటే సరిపోతుందా..? బంగారు తెలంగాణ అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు చల్లగా ఉంటే సరిపోతుందా..? తెలంగాణ ఉద్యమకారుల ఉసురు, అమరవీరుల ఉసురు ఊరికేపోదు.
- ప్రగతి నివేదన సభ కోసం కోట్లు ఖర్చు పెట్టి లక్షల మందిని పిలిపించి ప్రజలకు తిండి, నీళ్లు లేకుండా ఇబ్బంది పెట్టారు. ఈ సభలో కనీసం అమరవీరులను గుర్తు చేసుకున్నారా.?
- చెన్నూరులో ఆత్మహత్య చేసుకున్న గట్టయ్య ఆత్మ శాంతించాలంటే తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవాలి.
- కుమారుడిని సీఎంను చేయడానికి తెలంగాణ కేసీఆర్ ఫామ్ హౌజ్ కాదు. ప్రజల్లో నుంచి వచ్చిన వారు నాయకులు అవుతారు. ప్రజల్లోకి చొచ్చిన వారు రాజకీయ నాయకులు కారు.
- ఎంపీ కవిత నెల రోజులు ఉండటానికి అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆమె తిరిగిన కారు ఎవరిది..? ఆమెకున్న లాక్మే బ్యూటీ పార్లర్ ను డెవలప్ చేసుకోవడానికి ఏం చేశారో చెప్పగలరా..?
- 105 మందికి టిక్కెట్లు ఇచ్చి హరీష్ రావుకు దగ్గరగా ఉండేవారి నియోజకవర్గాల్లో గొడవలు సృష్టించి టిక్కెట్ ఇవ్వలేదు.
- పర్సంటేజీలు వచ్చే ఫైళ్లను క్రీయర్ చేసి, మిగతావి పక్కన పెట్టారు. డిపార్ట్ మెంట్ల వారీగా పెండింట్ ఫైళ్ల వివరాలు బయటపెట్టాలి.
- ప్రతిపక్షాలు ఏకమైతే తప్పుపడుతున్న కేసీఆర్ రాజకీయాల కోసం బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం సబబా..?
- డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, స్కైవేలు, ఆకాశ హార్మ్యాలు, కొత్త సెక్రెటేరియట్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణం ఏమైంది.
- పక్కింటి వారితోనే బాగా ఉంటాం, అటువంటిది కేసీఆర్ చంద్రబాబుతో ఎప్పుడూ వ్యక్తిగత వైరం పెంచుకునే తగాదా పెట్టుకున్నారు.
- హరికృష్ణ తెలంగాణ ఉద్యమకారుడా, తెలంగాణ అమరవీరుడా..? ఆయన స్మారక నిర్మాణానికి ఎవడబ్బ సొమ్మని తెలంగాణ భూమి ఇచ్చారు.? కొండా లక్ష్మాణ్ బాపూజీ, జయశంకర్ సార్ ల స్మారక స్థూపాలు ఎందుకు నిర్మించలేదు.