నేడు కృష్ణా, గోదావరి బోర్డు సమావేశం.. హాట్ హాట్ గానే

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యాల బోర్డు మీటింగ్ నేడు జరగనుంది. గెజిట్ ను ఖరారు చేసే ముందు ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2021-09-01 02:36 GMT

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యాల బోర్డు మీటింగ్ నేడు జరగనుంది. గెజిట్ ను ఖరారు చేసే ముందు ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ అంశాలపై తమ అభ్యంతరాలను తెలియజేశాయి. వెలిగొండ, హంద్రీ నీవా ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులతో పాటు శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తిపై కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసింది. అయితే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ పై చర్చతో పాటు నీటి వాటాలపై కూడా చర్చ జరగనుంది. తెలంగాణ ఇప్పటికే కృష్ణా నీటిలో యాభై శాతం వాటా కావాలని కోరుతుంది. ఏపీ దీనికి ససేమిరా అంటుంది. దీంతో ఈ సమావేశం హాట్ హాట్ గా జరగనుంది.

Tags:    

Similar News