భార్య మరణించిన 48 రోజులకే కృష్ణ.. ఏడాదిలో ముగ్గురి కన్నుమూత
ఈ ఏడాది ఘట్టమనేని కుటుంబానికి విషాదకరమైనదనే చెప్పాలి. సంవత్సరం ఆరంభంలోనే కృష్ణ పెద్ద కొడుకు, నటుడు, మహేశ్ సోదరుడైన రమేష్
టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఘట్టమనేని కృష్ణ (79) ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయనను గోల్డెన్ అవర్ లో తీసుకువచ్చి ఉంటే బ్రతికేందుకు కొంతవరకూ అవకాశం ఉండేదని, కానీ.. పూర్తిగా స్పృహ లేకుండా ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారని కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మన్ మీడియాకు తెలిపారు. కృష్ణ మరణంతో.. కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇది మాటలకు అందని విషాదం అంటూ.. ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు.
ఈ ఏడాది ఘట్టమనేని కుటుంబానికి విషాదకరమైనదనే చెప్పాలి. సంవత్సరం ఆరంభంలోనే కృష్ణ పెద్ద కొడుకు, నటుడు, మహేశ్ సోదరుడైన రమేష్ బాబు కన్నుమూశారు. జనవరి 8వ తేదీన రమేష్ బాబు అనారోగ్యంతో మరణించడం.. ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. తాము ఉండగానే కొడుకు కన్నుమూయడాన్ని తట్టుకోలేకపోయారు కృష్ణ-ఇందిరాదేవి. రమేష్ బాబు మరణం ఆ కుటుంబానికి పెద్ద షాకే ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకే కృష్ణ మొదటిభార్య, మహేష్ తల్లి ఇందిరాదేవి తనువు చాలించారు. సెప్టెంబర్ 28న ఆమె కూడా అనారోగ్యంతో ఇంటి వద్దే కన్నుమూశారు.
ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కూడా కన్నుమూశారు. మహేష్ కు ఇది నిజంగా తీరని శోకమే. కృష్ణకు మొత్తం ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్, ప్రియదర్శిని, మంజుల, పద్మావతి. సోదరుడు, తల్లి, తండ్రిని వరుసగా కోల్పోయి కొండంతం దుఃఖంలో ఉన్న మహేష్ కు నెటిజన్లు మహేష్ కు ధైర్యం చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు.