మాజీ ప్రధాని దేవెగౌడ కుమారులు ఇద్దరు ఇప్పుడు ఒకేసారి బ్యాడ్ అయ్యారు. ఒకరు ముఖ్యమంత్రి కుమార స్వామి అయితే మరొకరు మంత్రి రేవణ్ణ. ఇద్దరు రెండు రకాల సంఘటనల్లో ప్రజల చేత ఛీ అని ఒకేసారి అనిపించుకోవడం విశేషం. ఇంతకి వీరు చేసిన చెత్త పని ఏమిటి అనుకుంటున్నారా ? ఈ రెండు సంఘటనలు కాకతాళీయంగానే జరిగాయి మరి.
ఏరియల్ సర్వే లో ...
కర్ణాటక లో కూడా కేరళ స్థాయిలో కాకపోయినా భారీ వర్షాలు కొన్ని జిల్లాలను నీట ముంచాయి. ఈ నష్టాన్ని చూసేందుకు ఏరియల్ సర్వేకు బయల్దేరారు ముఖ్యమంత్రి కుమార స్వామి. చూసి వస్తే బాగానే ఉండేది. కానీ ఆయన విమానం ఎక్కి పేపర్ చదువుకుంటూ కూర్చున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో సౌకర్యాలు అనుభవించే నేతలు చాలా మంది చేసే చెత్త పనులు ఆధునిక టెక్నలాజి పుణ్యామాని ప్రపంచానికి తెలిసిపోతున్నాయి.
బిస్కెట్లు విసిరేస్తూ......
అలాగే కుమార స్వామి చేసిన నిర్వాకం బట్టబయలు అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఇది అలా ఉంటే దేవెగౌడ మరో కుమారుడు కర్ణాటక మంత్రి రేవణ్ణ ఇంకా చెత్త పని చేస్తూ పబ్లిక్ వీడియో లో చిక్కారు. బిస్కట్లు, ఆహార పదార్ధాలు వరద బాధితులకు కుక్కలకు విసిరినట్లు విసురుతూ వీడియోలో బుక్ అయ్యారు. ఈ రెండు వీడియో లు ఇప్పుడు ఒక రేంజ్ లో వైరల్ గా మారాయి. ఛాన్స్ ఇస్తే వీరి ప్రత్యర్ధులు ఊరుకుంటారా మరి...