నన్ను క్షమించండి… ఇక సర్వేలు చేయను..!

రాజకీయాలకు సన్యాసం తీసుకున్న మాజీ ఎంపీ లగడపాటి సర్వేలకూ సన్యాసం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ దెబ్బకు లగడపాటి చెప్పిన లెక్కలు చిత్తయ్యాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని [more]

Update: 2019-05-24 12:06 GMT

రాజకీయాలకు సన్యాసం తీసుకున్న మాజీ ఎంపీ లగడపాటి సర్వేలకూ సన్యాసం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ దెబ్బకు లగడపాటి చెప్పిన లెక్కలు చిత్తయ్యాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆయన చెప్పగా సీన్ రివర్స్ అయ్యి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో లగడపాటి రాజగోపల్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. లగడపాటి సర్వేను నమ్మి కొందరు కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు. నిన్నటి నుంచి మొహం చాటేసిన లగడపాటి రాజగోపాల్ ఇవాళ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన సర్వే తప్పయిందని.. ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. తన సర్వేతో ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమించాలని, ఇక నుంచి సర్వేలు చేయనని ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

Tags:    

Similar News