1 July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

చమురు కంపెనీలు ప్రజలకు గుడ్ న్యూస్ అందించాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు పెట్రోలు, గ్యాస్ సిలిండర్ల ధరలను సమీక్ష చేస్తాయి. జులై ఒకటో తేదీ కావడంతో సమీక్ష చేసి గ్యాస్ సిలిండర్ ధరలపై కొంత తగ్గించాయి.

Update: 2024-07-01 13:49 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

గుడ్ న్యూస్....తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

చమురు కంపెనీలు ప్రజలకు గుడ్ న్యూస్ అందించాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు పెట్రోలు, గ్యాస్ సిలిండర్ల ధరలను సమీక్ష చేస్తాయి. జులై ఒకటో తేదీ కావడంతో సమీక్ష చేసి గ్యాస్ సిలిండర్ ధరలపై కొంత తగ్గించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

Etala Rajender : ఈటలకు కావాల్సిందేమిటి? జరుగుతున్న దేంటి? ఇక్కడ కూడా అంతేనా?

ఈటల రాజేందర్ మావోయిస్టు ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర మంత్రి అయ్యారు. బీఆర్ఎస్ లో ఉద్యమకాలం నుంచి పనిచేసి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు కూడా కేసీఆర్ ఈటల రాజేందర్ కు ప్రయారిటీ ఇచ్చారు.

Nadendla Manohar : నాదెండ్ల ఫుల్లు ఫైర్ లో ఉన్నారు... మినిస్టర్ పవర్ ఏంటో చూపిస్తున్నారుగా?

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం ఏర్పాటయి పక్షం రోజులు కూడా కాలేదు. అయితే మంత్రులు అందరితో పోలిస్తే నాదెండ్ల మనోహర్ తన స్పెషాలిటీ చూపిస్తున్నారు. తనకున్న అనుభవాన్ని ఆయన ఉపయోగించి మరీ ఆయన తనకు కేటాయించిన శాఖలో ప్రక్షాళన చేపడుతున్నారు.

Pawan Kalyan : ఆ ఎమ్మెల్యేలిద్దరికీ పవన్ బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ‌్ తన పార్టీ జనసేనకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను ప్రభుత్వ విప్ లుగా ప్రకటించాలని ఆయన చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు.

Ys Jagan, KCR : కేసీఆర్ కు వాళ్లున్నారు.. జగన్ కు ఎవరున్నారు? ఒంటరి పోరాటం చేయాల్పిందేనా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రభుత్వాలు మారిపోయాయి. తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు పవర్ ను అనుభవించి ఓటమిని చవిచూశారు.

Andhra Pradesh : ఈ కలెక్టర్ ఎవరో మీకు తెలుసా?

పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్ గా చదలవాడ నాగరాణి బాధ్యతలు తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ఆమెను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించారు. చదలవాడ నాగరాణి కన్నా ఆమె భర్త ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర అందరికీ సుపరిచితం. హైదారాబాద్ లో ఎస్సార్ నగర్ సెంటర్లో పట్టపగలు మావోయిస్టులు హత్య చేశారు.

Breaking : కేసీఆర్‌కు హైకోర్టులో నిరాశ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో నిరాశ ఎదురయింది. కేసీఆర్ విద్యుత్తు కమిషన్ పై వేసిన పిటీషన్ పై హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ కేసీఆర్ పిటీషన్ వేశారు. ఈ కమిషన్ విచారణను నిలుపుదల చేయాలంటూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.

మహిళలకు యాభై వేలు.. ఎప్పటి నుంచో చెప్పిన సీఎం

రాష్ట్రంలో నిరుపేద మహిళలకు యాభై వేల రూపాయల చొప్పున అందించనున్నామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. సుభద్ర యోజన పథకం కింద మహిళలకు యాభై వేల రూపాయల గిఫ్ట్్‌ ఓచర్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

కేదార్‌నాథ్‌లో మంచు తుపాను

కేదార్‌నాథ్‌లో మంచు తుపాను సంభవించింది.ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ గాంధీ సరోవర్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం మంచు తుపాను చెలరేగింది. కేదార్‌నాథ్‌ దామ్‌ వెనుక వైపు ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం ఐదు గంటలకు మంచు తుపాను రావడంతో కొంత భయాందోళనలు నెలకొన్నాయి.

Andhra Pradesh : నేడు ఏపీలో టెట్ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మెగా డీఎస్సీ త్వరలో నిర్వహించనున్న సందర్భంలో టెట్ ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి పదహారో తేదీ వరకూ దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించారు.


Tags:    

Similar News