(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Revanth Reddy : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. దావోస్ టూర్ సక్సెస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావెస్ పర్యటన విజయవంతమయిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తెలంగాణకు భారీ పెట్టుబడులు ఈ పర్యటనతో లభించాయని చెప్పారు. దాదాపు నలభై వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను వివిధ సంస్థలతో రేవంత్ రెడ్డి కుదుర్చుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఈ తరం చూస్తున్న మొదటి పెద్ద పండుగ
జనవరి 22... ఇంకపై ప్రతీ భారతీయునికి, ముఖ్యంగా హిందువులకు మరచిపోలేని రోజు. అయోధ్యలో రాముని పున:పట్టాభిషేకం సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాలూ రామనామ స్మరణతో నిండిపోతున్నాయి. ‘సోమ సూర్యులు, సురలు, తారలు, ఆ మహాంబుధులు, అవనీ చంద్రులు... అంతా రామమయం’ అంటారు భద్రాచల రామదాసు.
Breaking : అమెజాన్ కు కేంద్రం నోటీసులు
అమెజాన్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. అమెజాన్ లో అయోధ్య లడ్డూలంటూ నకిలీవి విక్రయిస్తుండటంతో ఈ మేరకు ఆ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ కన్సూమర్ ప్రొడక్షన్ ఈ మేరకు అమెజాన్ కు నోటీసులు పంపింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
Sunitha : గెలిచినా ఓడినట్లేనా... ఎందుకిలా.. జరుగుతోంది?
కాంగ్రెస్ లో ఉండగా గెలిచి మంత్రి అయ్యారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత మాత్రం ఆమెకు కాలం కలసి రావడం లేదు. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అధికారాలు లేకుండా పోయింది. ఆమె నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. సునీతా లక్ష్మారెడ్డి సీనియర్ నేత. తెలంగాణ రాజకీయాల్లో ఆమె మృదుస్వభావిగా పేరు పొందారు.
నేల మీద పడక.. పళ్ళు, కొబ్బరి నీళ్లే ఆహరం
రామ మందిరం ప్రతిష్టాపన సందర్భంగా దేశ ప్రధాని మోడీ 11 రోజుల ఉపవాస దీక్షను చేస్తున్నారు. రాముని విగ్రహ ప్రతిష్ట పూర్తి అయిన తర్వాత ఆయన దీక్షను విరమించనున్నారు. ఈ 11 రోజులు ఆయన నేల మీదే నిద్రిస్తున్నారు. భోజన సమయంలో పళ్ళు తిని, కొబ్బరి నీళ్లు తాగుతున్నారు.
Chiranjeevi : ఎన్టీఆర్ గారి వల్లే ఆ ఆస్తులు కొన్నాను.. నేడు అవే..
లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా నందమూరి తారక రామారావు పుణ్య తిథి, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ వేదిక పై చిరంజీవి మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Breaking : రెండో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్ Advertisement
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన పాక్ నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన పెళ్లి విషయానని షోయబ్ మాలిక్ ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నట్లు అధికారికంగా వెల్లడయినట్లయింది.
Chandrababu : తొలి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. ఆ యువనేతకు షాక్ ఇచ్చిన అధినేత
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన పర్యటనలలో తొలి అభ్యర్థిని ప్రకటించినట్లయింది. అరకు నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జిగా సియ్యారి దొన్నుదొర పేరును ఆయన ప్రకటించారు.
Ayodhya : అయోధ్యను మందిరం.. స్వర్ణంతో
అయోధ్యలోని రామమందిరాన్ని బంగారంతో తయారు చేశాడు ఒక యువకుడు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ జిల్లాకు చెందిన కపిలవాయి గోపి స్వర్ణకారుడు. ఆయన అయోధ్యలో రామందిరం నమూనాతో బంగారంతో తయారు చేశారు. ఇది చూపరులను ఆకట్టుకుంటుంది.
Ayodhya : రాములోరికి పవన్ కల్యాణ్ విరాళం.. ఎంతంటే?
అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయింది. మరో రెండు రోజుల్లో ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.