29June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారికి ముఖ్య సూచనలను దేవస్థానం అధికారులు పలు సూచనలు చేశారు. వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, అన్ని శాఖల అధికారులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30లోపు రావొద్దని దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు.

Update: 2024-06-29 13:33 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Vijayawada : దుర్గమ్మ దర్శనానికి వీరు ఈ సమయాల్లో రావద్దు

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారికి ముఖ్య సూచనలను దేవస్థానం అధికారులు పలు సూచనలు చేశారు. వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, అన్ని శాఖల అధికారులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30లోపు రావొద్దని దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు.

Free Bus : కర్ణాటక తరహాలోనా? తెలంగాణ మాదిరిగానా? ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉండబోతుందంటే?

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో కర్ణాటక ప్రభుత్వం కొత్త ఎత్తుగడలకు దిగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుండటంతో కన్నడ నాట టెక్నిక్ లతో కొంత ఉచిత జర్నీకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనుమతించింది.

Tomato : టమాటా ధరలు ఇప్పుడిప్పుడే దిగిరావట.. నోటికి తాళం వేసుకోవాల్సిందే

టమాటా ధరలు ఇప్పుడిప్పుడే దిగి వచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే టమాటా ధరలు వంద రూపాయల వరకూ చేరుకుంది. రైతు బజార్లలో కిలో టమాటా ధర ఎనభై నుంచి డెబ్బయి రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. బయట మార్కెట్ లో ఎక్కువ ధర పలుకుతుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది టమాటా దిగుమతులు తక్కువగా ఉన్నాయి.

తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి

తమిళనాడులో టపాసుల తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. తమిళనాడులోని విరుధ్ నగర్ టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు.గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Breaking : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి

ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ మరణించారు. ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన రమేష్ రాథోడ్ ను హైదరాబాద్ కు తరలిస్తుండగా కన్నుమూశారు. ఆయన కిడ్నీ సమస్యతో కొంత కాలంగా బాధపడుతున్నారని తెలిసింది. రమేష్ రాథోడ్ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో ప్రారంభమయింది.

Pawan Kalyan : కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ‌్ కొండగట్టుకు చేరుకున్నారు. ఆయన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన మొక్కులు చెల్లించుకున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్ తన ఇలవేల్పు అయిన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆయన తరచూ కొండగట్టుకు వచ్చి పూజలు నిర్వహిస్తారు.

నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

అమర్‌నాథ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం అయింది. అమర్‌నాధ్ ఆలయ యాత్ర నేటి నుంచి ప్రారంభమై ఆగస్టు 19 వరకూ సాగనుంది. ఆషాఢ మాసం పౌర్ణమి రోజు నుంచి అమర్‌నాధ్ యాత్ర ప్రారంభమవుతుంది శ్రావణ పౌర్ణమి రోజు వరకు కొనసాగుతుంది. అయితే ఈ యాత్రకోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భక్తులకు మాత్రమే అనుమతిస్తారు.

T20 World Cup : నేడు వరల్డ్ కప్ ఫైనల్స్

నేడు భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య టీ 20 మ్యాచ్ ఫైనల్ పోరు జరగనుంది. టీ20 వరల్డ్ కప్ లో నేడు ఫైనల్స్ జరుగుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. పోరు హోరా హోరీగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. భారత్ రెండోసారి వరల్ట్ కప్ ను గెలవాలని తహతహలాడుతుంది.

Telangana : కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతి

తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. డి.శ్రీనివాస్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Telangana : గుడ్ న్యూస్.. తెలంగాణలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. దీంతో పరీక్షల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసి ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పకనే చెప్పింది. తెలంగాణలో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పిన మేరకు షెడ్యూల్ కూడా అధికారులు విడుదల చేవఆరు.

Tags:    

Similar News