3July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

తెలంగాణలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జైలు జీవితం నుంచి విముక్తి పొందనున్న వారిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు ఉన్నారు.

Update: 2024-07-03 12:31 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Telangana : ఒకేసారి 213 మంది ఖైదీలు విడుదల

తెలంగాణలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జైలు జీవితం నుంచి విముక్తి పొందనున్న వారిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఒక్కొక్కరు యాభై వేల రూపాయల సొంత పూచీకత్తు సమర్పించాలని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Yanamala : ఇప్పుడు బాధడుతున్నారా? అన్ని సీట్లు తీసుకుని మంత్రి పదవికి దూరమయ్యారా?

టీడీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పుడు బాధపడుతున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంపై పైకి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా, కొత్త వారికి అవకాశం కల్పించడంలో భాగంగా తన లాంటి సీనియర్లను దూరం పెట్టారని అనుకున్నా అందుకు మరొక కారణం కూడా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

Revanth Reddy : జగన్, కేసీఆర్ ల తీరు చూసి రేవంత్ రూటు మార్చారా? ఇక దబిడి దిబిడేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన పాలనపై సరిగా దృష్టి పెట్టలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు.

Andhra Pradesh : ఎన్నికల వ్యూహకర్తలకు ఇక కాలం చెల్లిందా? సొంత వ్యూహాలే బెటర్ అనిపిస్తున్నాయా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా ఇంకా గెలుపు, ఓటములపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలతో ఒక విషయం మాత్రం తెలిసి వచ్చిందేమిటంటే.. సర్వే సంస్థలతో పాటు వ్యూహకర్తలు కూడా వృధాయేయనని. వ్యూహకర్తలు కేవలం బ్యాక్ ఎండ్ లో కొన్ని కార్యక్రమాలను రూపొందించడానికే ప్లాన్ చేయాలి.

Kalvakuntla Kavitha : కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి న్యాయస్థానం పొడిగించింది. ఈరోజు కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపర్చారు. జైలు నుంచే కవితను న్యాయస్థానం ఎదుట హాజరుపర్చడంతో న్యాయమూర్తి జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా మహేశ్ చంద్ర లడ్హా

ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ విభాగం చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా నియమితులయ్యారు. కేంద్ర సర్వీసుల డిప్యుటేషన్ పూర్తి చేసుకుని తిరిగొచ్చిన ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్హాను ఇంటలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని పలు జిల్లాలు, హైదరాబాద్‌లో ఎస్పీ, డీసీపీగా పని చేసిన అనుభవం ఉంది.

Pawan Kalyan : నేడు కూడా కాకినాడ జిల్లాలోనే పవన్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కూడా కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. మూడోరోజు ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈరోజు కూడా పలు కార్యక్రమాల్లో పవన్ కల్యాణ‌్ పాల్గొననున్నారు. ఆయన ఈరోజు ఉప్పాడ తీరాన్ని పరిశీలించనున్నారు. సముద్రం ముందుకు వస్తుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

పట్టిసీమ నుంచి నీరు విడుదల

పట్టిసీమ నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టా రైతులకు సాగు నీరు అందించేందుకు ఈ నీటిని విడుదలచేశారు. వెయ్యి క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. పోలవరం కుడి కాల్వ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నీటిని విడుదల చేశారు.

రేపు బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

తెలంగాణలో రేపు పాఠశాలలు, కళాశాలలకు బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. నీట్ పరీక్షలపై సమగ్ర విచారణను జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపు నిచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, పీడీఎస్‌ఓ, ఎన్‌ఎస్‌‍‍యూఐ విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపు నిచ్చాయి.

Road Accident : పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలంగాణ యువకుల మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మరణించారు. పూణె నగరం శివార్లలో ఈ ప్రమాదం జరిగింది. భిగ్వాన్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. స్పాట్ లోనే వారు మరణించారు.


Tags:    

Similar News