31May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

రేపు లోక్ సభ తుదివిడత పోలింగ్ జరగనుంది. చివరి విడతలో 57 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకూ ఆరు విడతలుగా పోలింగ్ దేశ వ్యాప్తంగా జరిగింది. ఆరు విడతల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ఏడో విడత ఎన్నికల బరిలో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Update: 2024-05-31 12:53 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Loksabha Elections : రేపటితో ఆఖరి విడత పోలింగ్

రేపు లోక్ సభ తుదివిడత పోలింగ్ జరగనుంది. చివరి విడతలో 57 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకూ ఆరు విడతలుగా పోలింగ్ దేశ వ్యాప్తంగా జరిగింది. ఆరు విడతల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ఏడో విడత ఎన్నికల బరిలో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Narendra Modi : ధ్యానంలో ఉన్నప్పుడు మోదీ వీటినే తీసుకుంటారట

ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో నలభై ఐదు గంటల పాటు ధ్యానం చేయనున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఆయన ధ్యానం ప్రారంభించారు. అయితే ఆయన ధ్యానం సమయంలో ఆయన ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. కేవలం ద్రవాహారాలను మాత్రమే తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆహారం లేకుండా కేవలం కొబ్బరినీళ్లు, మంచినీళ్లను మాత్రమే స్వీకరిస్తూ మోదీ ధ్యానం చేస్తారు. కేవలం గొంతు ఆరిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు మంచినీళ్లు తాగుతారని చెబుతున్నారు.

T20 World Cup 2024 : అనుభవం ఒకటే కాదు భయ్యా...దూకుడు బ్యాచ్ కావాలి మాకు

టీ 20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. టీం ఇండియా ఈసారి బలంగానే బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ లో మంచి ఫామ్ లో ఉన్న వారినే ఎంపిక చేసింది. ఎందుకంటే ఐపీఎల్ మే 25వ తేదీన ముగిసింది. టీ 20 వరల్డ్ కప్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. అంటే పెద్దగా సమయం లేదు. అంటే ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేసి ఈసారి బీసీసీఐ ఒక ప్రయోగం చేసిందనే చెప్పాలి. కొడితే కొట్టాలిరా కప్ అన్నట్లు ఒకరకంగా జట్టును కూర్పు చేయడంలో అన్ని రకాలుగా అంచనాలు వేసి మరీ ఎంపిక చేసింది.

Ys Jagan : జగన్ ఎలక్షనీరింగ్ పనిచేస్తుందా? ఈ ప్రయోగం ఫలించకపోతే.. ఇక పాతపద్ధతి బెటర్ అన్నట్లేగా?

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జరిగిన ఎన్నికలు విభిన్నంగా జరిగాయి. ఎందుకంటే కేవలం మ్యానిఫేస్టోనే కాదు... అభ్యర్థుల ఎంపిక కూడా ఈసారి విలక్షణంగా జరిగిందనే చెప్పాలి. అందులో రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ కొత్త ఒరవొడిని సృష్టించారు. గతంలో ఎవరూ చేయని సాహసానికి ఆయన ఒడిగట్టారనే చెప్పాలి. దేశ రాజకీయాల్లో ఇది అతి పెద్ద ప్రయోగంగానే చూడాలి.

Ap Elections : ఐఏఎస్, ఐపీఎస్‌లు అంత తోపులా..? వాళ్లకేమైనా అతీత శక్తులున్నాయా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజుల్లో వెలువడనున్నాయి. అయితే ప్రజల నాడి ముందుగానే ఐఏఎస్, ఐపీఎస్ లకు తెలిసిపోయిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయపడుతున్నారు. వారు ప్రజా క్షేత్రంలో ఉంటారు కాబట్టి.. ఉద్యోగుల నుంచి అంటే తమకు సన్నిహితులైన పోలింగ్ సిబ్బంది నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ప్రకారం వారి అడుగులు ఉంటాయంటారు.

Ap Elections : చంద్రబాబు అలా కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం అదేనా? అంటే గెలిచినట్లేగా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల్లో తనదే గెలుపు అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వైసీపీకి కేవలం 35 సీట్లు వస్తాయని ఆయన చెబుతున్నారు. ఆయన అన్ని రకాలుగా తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమేం మొదట చేయాలో? అన్నది కూడా ఆయన ప్రిపేర్ అవుతున్నారట. అంతే కాదు.. ఈసారి తన పాలనలో ప్రత్యేకతను చూపించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారట.

Telangana : గుర్తులు చెరిపేసే ప్రయత్నమా..? కేసీఆర్ అనే మాట ఇక విననపడకూడదనేనా? అయితే మీరేం చేశారు సామీ?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఏపీకి చెందిన కీరవాణికి స్వర రచన చేయడం అప్పగించడం పై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెద్దయెత్తున వాదన జరుగుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే చర్యగా కారు పార్టీ నేతలు దీనిని అభవర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Andhra Pradesh : ఏబీకి గుడ్ న్యూస్... ఈరోజు జాయినింగ్.. ఈరోజే రిటైర్‌మెంట్

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సర్వీసులోకి తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఆయనను సర్వీసులోకి తీసుకోవడానికి సంసిద్ధతను వ్యక్తిం చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై రెండు సార్లు ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సస్పెండ్ చేసింది.

బిషప్ తుమ్మ బాల కు రేవంత్ ఘన నివాళులు

వరంగల్ బిషప్ తుమ్మ బాల కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఎన్నికలకు ముందు కూడా తాను ఆయన వద్దకు వెళ్లానని, ప్రార్థనలు చేసి మంచి పాలన రావాలని కోరుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

Ys Jagan : నేడు రాష్ట్రానికి వైఎస్ జగన్ దంపతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకోనున్నారు. పది హేను రోజుల తర్వాత ఆయన విదేశీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకుంటున్నారు. వైఎస్ జగన్, భార్య భారతితో కలసి ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ నెల 17వ తేదీన విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఆయన రాత్రి లండన్ కు బయలుదేరి వెళ్లారు.


Tags:    

Similar News