4June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

భారత ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ముందంజలో ఉన్నారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. అయితే మళ్లీ ముందంజలోకి మోదీ వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌పై 619 ఓట్ల ఆధిక్యంలో మోదీ ఉన్నారు.

Update: 2024-06-04 12:55 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

మళ్లీ ముందంజలో ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ముందంజలో ఉన్నారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. అయితే మళ్లీ ముందంజలోకి మోదీ వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌పై 619 ఓట్ల ఆధిక్యంలో మోదీ ఉన్నారు.

Pawan Kalyan : ప్రతిజ్ఞ పూనాడు.. పాతాళానికి తొక్కేస్తానన్నాడు.. చేసి చూపించాడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకున్నది సాధించాడు. జగన్ నిన్ను గెలవనివ్వను.. పాతాళంలోకి తొక్కేస్తా అని ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్ దానిని నిలబెట్టుకున్నాడు. గత కొన్నేళ్ల నుంచి కేవలం అభిమానంతోనే సరిపుచ్చి ఓటు వేయలేదనే దాని నుంచి అన్ని ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో జనసేనాని సక్సెస్ అయ్యారు.

బండి సంజయ్ భారీ విజయం

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా బీఆర్ఎస్ కనిపించలేదు. కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 2.12 లక్షల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి బి.వినోద్ కుమార్‌పై బండి సంజయ్ విజయం సాధించారు. ఈ విజయంతో బండి సంజయ్ రెండోసారి కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు.

Ap Elections Counting : ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పింది రివర్స్ అయిందిగా... ఆరా అంచనా తప్పిందిగా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వన్ సైడ్ మెజారిటీ లభిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కూడా నాడి అందలేదు. ముఖ్యంగా ఇప్పటి వరకూ లెక్క తప్పని ఆరా మస్తాన్ అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తుందని పూర్తి విశ్వాసంతో ఆరా మస్తాన్ చెప్పారు. ఆయన మాటలను నిజమని చాలా మంది విశ్వసించారు. గతంలో ఆయన చెప్పినవి చెప్పినట్లు జరగడంతో ఆయన ఈసారి కూడా అంచనాలు నిజమవుతాయని అందరూ భావించారు. కానీ ఆయన చెప్పిన అంకెలు వెక్కిరించాయి.

Ap Elections : ఏపీలో కూటమిదే అధికారం.. చంద్రన్న వ్యూహం అలా కలసి వచ్చేటట్లు చేసిందిగా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు. ఐదేళ్ల పాటు పార్టీని కాపాడుకోవడంలో చంద్రబాబు పడిన శ్రమకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. ఏడు పదుల వయసులోనూ చంద్రబాబు 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే 2024 ఎన్నికలకు క్యాడర్ ను ప్రిపేర్ చేశారు. అంతటి దూరదృష్టి ఉన్న నేత చంద్రబాబు. చంద్రబాబుకు చరిష్మా లేకపోవచ్చు. సరైన వాగ్దాటి ఆయన సొంతం కాకపోవచ్చు.

Ys Jagan : జగన్ చేసిన తప్పులివే... అవే ఫ్యాన్ పార్టీ ఓటమికి కారణమయ్యాయా?

వైఎస్ జగన్ తనకు తిరుగు లేదనుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఒక ఛాన్స్ ఇవ్వాలని అధికారంలోకి వచ్చిన జగన్ ఒకరకంగా ఏపీని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారన్న విమర్శలున్నాయి. కేవలం ప్రజల సొమ్ముతో వారినే తమ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి.

Amit Shah: అమిత్ షా విజయం

గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయం సాధించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అమిత్ షా తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి సోనాల్‌ రమణ్‌భాయ్‌పై 3.7లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో షా 5.57 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గతంలో బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఈ స్థానం నుండి ప్రాతినిధ్యం వహించారు.

Telangana : బీఆర్ఎస్ కు భారీ నష్టం.. కోలుకుంటుందా? తేరుకుంటుందా?

తెలంగాణలో బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. గతంలో ఎన్నడూ ఏ ఎన్నికల్లో జరగని అవమానం మిగిలింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దో గొప్పో ఓట్ల శాతాన్ని తెచ్చుకున్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. జనం రావడానికి.. ఓట్లు పడటానికి సంబంధం లేదని తేలిపోయింది. కేసీఆర్ బస్సు యాత్రకు పెద్దయెత్తున జనం రావడంతో కనీస స్థానాల్లో అయినా కారు పార్టీ విజయం సాధిస్తుందని అందరూ అంచనా వేశారు.

అల్లు అర్జున్ మద్దతిచ్చిన వైసీపీ నేత ఓటమి

నంద్యాల‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ‌ద్ద‌తు తెలిపిన వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డి ఓట‌మి చ‌విచూశారు. ర‌విచంద్ర‌పై టీడీపీ అభ్య‌ర్థి మ‌హ్మ‌ద్ ఫ‌రూక్ ప‌ద‌కొండు వేల‌కు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘ‌న విజ‌యం సాధించారు. నంద్యాల‌లో శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డి త‌ర‌ఫున బ‌న్నీ ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. దీన్ని చాలామంది జ‌న‌సైనికులు త‌ప్పుబ‌ట్టారు. అంతేకాకుండా అల్లు అర్జున్‌, ర‌విచంద్ర‌పై అనుమ‌తి లేకుండా జ‌నాల‌ను పోగు చేశారంటూ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

వేణుస్వామి వివరణ విన్నారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పకుండా గెలుస్తారని చెప్పిన వారిలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా ఉన్నారు. ఆయన వీడియోను సోషల్ మీడియాలో పలువురు హైలైట్ చేశారు. అయితే ఇప్పుడు తన లెక్క తప్పిందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.


Tags:    

Similar News