5July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

తిరుమల ఎక్స్‌ప్రెస్ ను నేటి నుంచి రైల్వే శాఖ అధికారులు రద్దు చేశారు. ఈరోజు నుంచి పదకొండో తేదీ వరకూ తిరుమల ఎక్స్‌ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. విజయవాడ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో తాత్కాలికంగా తిరుమల ఎక్స్‌ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Update: 2024-07-05 13:56 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

నేటి నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్ రద్దు

తిరుమల ఎక్స్‌ప్రెస్ ను నేటి నుంచి రైల్వే శాఖ అధికారులు రద్దు చేశారు. ఈరోజు నుంచి పదకొండో తేదీ వరకూ తిరుమల ఎక్స్‌ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. విజయవాడ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో తాత్కాలికంగా తిరుమల ఎక్స్‌ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Pawan Kalyan : పవన్ కల్యాణ్ మరో వ్యూహం రచించారా? అందుకే సెట్ చేస్తున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత చూస్తే పూర్తిగా మారిపోయినట్లే కనిపిస్తుంది. గత నెల 12వ తేదీన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తీరును గమనించిన వాళ్లు ఎవరైనా ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

KCR : చూశావా రాజా.. ఏం జరుగుతుందో... ఎవరెవరిని నెత్తిన పెట్టుకున్నావో .. అర్థమయిందా?

చేర్చుకుంటున్నప్పుడు బాగానే ఉంటుంది.. కానీ అధికారం పోయిన తర్వాత ఎవరూ ఉండరు. ఇది అన్ని పార్టీలకూ అప్లయ్ అవుతుంది. నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. నాడు తమ పార్టీ నుంచి వెళ్లి బీఆర్ఎస్ లో పదవులు పొంది, పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వారిని కూడా వదలడం లేదు.

Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లపైనే నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా వర్షం కురియడంతో రోడ్డుపైన ఉన్న ప్రజలు వర్షంలో చిక్కుకుపోయారు. కార్యాలయాల నుంచి బయలుదేరే సమయంలో వర్షం కురవడంతో రహదారులపై నీళ్లు నిలవడంతో అనేకచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.

తెలంగాణకు కొత్త ఎన్నికల కమిషనర్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈవో వికాస్‌రాజును ఎన్నికల కమిషన్ రిలీవ్‌ చేసింది. సుదర్శన్‌ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వికాస్ రాజ్ ను రిలీవ్ చేయడంతో ఆయన తిరిగి పోస్టింగ్ ఇవ్వనున్నారు.

Breaking : హీరో రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సినీ హీరో రాజ్్తరుణ్ పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. తనతో కొన్నేళ్లుగా సహజీవనం చేసిన రాజ్ తరుణ్ తర్వాత వేరే హీరోయిన్ వెంట తిరుగుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Vijayawada : బెజవాడ వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తున్న పాత కేసులు.. తిరగదోడి మరీ ?

గత ఐదేళ్లుగా జరిగిన ఘటనలపై విజయవాడ నేతలు, కార్యకర్తల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. వరసకేసులతో బెజవాడ వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు తాజాగా కేసులు రీ ఓపెన్ చేసి మరీ నిందితుల కోసం వెదుకుతున్నారు.

Chandrababu : నిర్మలమ్మను కలిసిన బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆమెను చంద్రబాబు కోరారు. తగిన చేయూతనిచ్చి ఉదారంగా నిధులను మంజూరు చేయాలన్నారు.

London : క్షమించండి.. ఓటమికి పూర్తిగా నాదే బాధ్యత

బ్రిటన్ ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటమి పాలయింది. ప్రధాని రిషి సునాక్ కూడా పార్టీ ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ఆయన ప్రకటించారు. బ్రిటన్ లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. కీర్ స్టార్మర్ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించనున్నారు.

Telangana : తెలంగాణలో విజృంభిస్తున్న జ్వరాలు.. ఆసుపత్రులన్నీ కిటకిట

తెలంగాణలో వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు పడుతుండటం, వాతావరణ మార్పులతో విష జ్వరాలు చుట్టుముట్టాయి. దీంతో అనేక మంది ప్రజలు అనారోగ్యానికి పాలయి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఎక్కువ మంది ఆసుపత్రుల్లో చేరుతుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి.


Tags:    

Similar News