7June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. దేశంలో పార్లమెంటు సభ్యులు ఎన్నికయ్యారు. అయితే దేశంలోనే తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే అత్యంత ధనిక పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. దేశంలో ఎంపికైన పార్లమెంటు సభ్యులలో 93 శాతం మంది కోటీశ్వరులే. ఈ విషయాన్నీ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ తెలిపింది.

Update: 2024-06-07 12:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Richest Politician in India: పార్లమెంటులో మొనగాళ్లు మనోళ్లే

లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. దేశంలో పార్లమెంటు సభ్యులు ఎన్నికయ్యారు. అయితే దేశంలోనే తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే అత్యంత ధనిక పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. దేశంలో ఎంపికైన పార్లమెంటు సభ్యులలో 93 శాతం మంది కోటీశ్వరులే. ఈ విషయాన్నీ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ తెలిపింది.

Union Cabinet : మోదీ కేబినెట్ లో మనోళ్లు వీళ్లే...ఈ నలుగురి పేర్లు కన్ఫర్మ్‌ అట.. ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి

కేంద్ర ప్రభుత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేరనుంది. అయితే కీలక శాఖల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఏదో ఒక పదవి ఉంటేచాలునన్న ఉద్దేశ్యంలో ఆయన ఉన్నారు. ఎన్డీఏలో అతి పెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు దక్కుతాయన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతుంది.

Narendra Modi : అటు ఆయన.. ఇటు ఈయన.. మధ్యలో మోదీ.. ఆచితూచి అడుగులేయాల్సిందేనా?

మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలన సజావుగా సాగడం అంత సులువు కాదు. ఇద్దరు సీనియర్ నేతల మధ్య మోదీ చిక్చుకున్నారు. రాజకీయ అనుభవంలోనూ, పార్టీలను అలవోకగా మార్చడంలోనూ అందెవేసిన చేతులతో ఆయన ఒక రకంగా సర్కస్ చేయనున్నారు. ఇప్పటి వరకూ సాగించిన పదేళ్ల పాలనను తన ఇష్టమొచ్చినట్లు సాగించిన మోదీకి ఇక దూకుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు.

Ap Politics : 12న మోదీ ఏపీకి వస్తే ఆ హామీ ఇస్తారా.. చంద్రబాబు ప్రయత్నమే అదటగా

ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు ఎన్డీఏ నేతలను తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. 12న అమరావతిలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

T20 World Cup 2024 : పాక్ కు ఘోర పరాభావం.. పసికూన చేతిలో దారుణ ఓటమి

వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. పాక్ తొలి మ్యాచ్ లోనే ఓటమిని చవి చూసింది. అదీ క్రికెట్ లో ఊరు పెద్ద.. పేరు చిన్నగా ఉన్న అమెరికా చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలయింది. నిజానికి క్రికెట్ లో అమెరికా పెద్ద జట్టు ఏమీ కాదు. దానిపై అంచనాలు కూడా లేవు. అసలు అమెరికాలో క్రికెట్ ఉందా?

YSRCP : చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రెండు రోజులు ముందుగానే.. జగన్ కీలక నిర్ణయం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగోసారి ఆయన సీఎంగా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే ఇందుకు రెండు రోజులు ముందుగానే యాక్టివ్ అవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూశారు. 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు.

Breaking : కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నీరబ్ కుమార్ ప్రసాద్ సీనియర్ ఐఏఎస్ కావడంతో ఆయనను నియమానికి చంద్రబాబు మొగ్గుచూపారు. నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.

టీడీపీ కార్యకర్తలకు బ్రహ్మాజీ కోరిక

టీడీపీ కార్యకర్తలకు సినీనటుడు బ్రహ్మాజీ తన మనసులో ఉన్న మాటను చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు చేసిన తప్పులు చేయవద్దని కోరారు. కేవలం ఏపీని అభివృద్ధి చేసే దిశగానే ప్రయత్నించండి అని కోరారు. మళ్లీ పనిలోకి దిగండని, ఏపీ సురక్షితమైన చేతుల్లోనే ఉందని, మీ భవిష్యత్ పై దృష్టి పెట్టాలని కోరారు.

Hyderabad : నేడు కూడా హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

పార్లమెంటులో మరోసారి కలకలం... ముగ్గురు యువకులు

పార్లమెంట్లోకి ప్రవేశించ బోయిన ముగ్గురు అగంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోకి ప్రవేశించి స్మోక్ బాంబులతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఘటన మరవక ముందే మరోసారి కొత్త పార్లమెంటులోకి కొందరు ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News