7July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

నేడు పూరీలోని జగన్నాధయాత్ర కొనసాగనుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. పూరీ జగన్నాధయాత్రలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చారు. పూరీ జగన్నాధయాత్ర ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది కావడంతో ఈ యాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయపరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటికిటలాడుతున్నాయి.

Update: 2024-07-07 13:16 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

నేడు పూరీ జగన్నాధయాత్ర

నేడు పూరీలోని జగన్నాధయాత్ర కొనసాగనుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. పూరీ జగన్నాధయాత్రలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చారు. పూరీ జగన్నాధయాత్ర ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది కావడంతో ఈ యాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయపరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటికిటలాడుతున్నాయి.

Telangana : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనున్న సర్కార్.. ఎప్పటి నుంచి అంటే?

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి అంతా సిద్ధం చేసింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని కూడా వీలయినంత త్వరలోనే అమలు చేయాలని నిర్ణయించింది.

Chandrababu : చంద్రబాబు ప్రయత్నాలన్నీ వృధాయేనా? అటు వైపు చూసేది వారు మాత్రమేనట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు. మరో ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటారు. అయితే ఆయన ఇప్పుడు తెలంగాణ పార్టీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంపై సొంత పార్టీలోనే పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా ఎవరు విశ్వసిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి.

కీసర గ్రామంలో మచ్చల జింక

కీసర టోల్ ప్లాజా వద్ద మచ్చల జింక కనిపించింది. కుక్కలు దాడి చేయటంతో ఒంటి పై గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ గ్రామస్తులు చేతికి మచ్చల జింక చిక్కింది. మచ్చల జింకను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇలాంటి జింక తమ గ్రామ పరిసర ప్రాంతాల్లోకి రావడంతో అందరూ గుమిగూడారు.

Tirumala : ఆదివారం.. తిరుమల రద్దీ మామూలుగా లేదుగా

తిరుమలలో రద్దీ అధికంగానే ఉంది. ఆదివారం కావడంతో తిరుమలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సహజంగా శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య అధికంగానే ఉంటుంది. మొక్కులు చెల్లించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో తిరుమలలోని వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.

YSRCP : సీమ నేతల్లో అసహనం.. అంతా ఆయనే చేశారంటున్నారుగా? అందుకే దూరంగా ఉంటున్నారా?

వైసీపీకి ఇటీవల జరిగిన ఎన్నికలలో దారుణ ఓటమిని చవి చూసింది. అయితే ఈ ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణం జగన్ అని చెబుతున్నారు రాయలసీమ జిల్లాకు చెందిన నేతలు. రాయలసీమ జిల్లాల్లో పార్టీ దారుణంగా దెబ్బతినడానికి జగన్ వైఖరి కారణమని కొందరు అంటుంటే.. లేదు..లేదు..

గుజరాత్ లో కూలిన భవనం.. ఏడుగురు మృతి

గుజరాత్ లోని సూరత్ లో భారీ వర్షాలకు ఘోర ప్రమాదం జరిగింది. ఐదంతస్థుల భవనం కూలడంతో ఏడుగురు మరణించారు. సూరత్ సమీపంలోని సచిన్ పాలి గ్రామంలో ఐదంతస్థుల భవనం కూలింది. భారీ వర్షాలకు ఈ భవనం కూలింది. పురాతన భవనం కావడంతో ఎవరూ అక్కడ నివాసం ఉండటం లేదు. ఐదు కుటుంబాలకు చెందిన కూలీలు మాత్రమే ఉన్నారు.

నిత్య పెళ్లి కూతురు.. యాభై మందితో పెళ్లి చేసుకుని మరీ?

ఒకరు రెండో పెళ్లి చేసుకుంటేనే వెంటనే దొరికిపోతున్నారు. అలాంటి ఈరోజుల్లో యాభై పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకోవడం సాధ్యమా? అంటే సాధ్యమేనంటుంది నిత్య పెళ్లకూతురు. ఏకంగా యాభై మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కింది.

10వ తేదీన 13 స్థానాలకు ఉపఎన్నికలు

ఈనెల 10న దేశంలో 13 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10న దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందగా, మరికొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో వీటిని నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.

నేటి నుంచి ఆషాఢ మాస బోనాలు ప్రారంభం

హైదరాబాద్ లో నేటి నుంచి ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరగనున్న బోనాల ఉత్సవాలు ఈరోజు ఆదివారం ప్రారంభం కానున్నాయి. గోల్కొండ లోని శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం, తొట్టెల ఊరేగింపు జరగనుంది.


Tags:    

Similar News