8July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 35 మంది కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ నాయకత్వం తీపి కబురు అందించింది. ఒకే సారి ముప్ఫయి ఐదు మందికి పదవులను ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-07-08 12:37 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Breaking : తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గుడ్ న్యూస్.. 35 మందికి పదవులు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 35 మంది కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ నాయకత్వం తీపి కబురు అందించింది. ఒకే సారి ముప్ఫయి ఐదు మందికి పదవులను ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

MNP Rule: మీ మొబైల్ నంబర్ పోర్ట్‌ చేస్తున్నారా? ట్రాయ్‌ కొత్త నిబంధనలు

చాలా మంది మొబైల్‌ నెంబర్లను ఇతర నెట్‌వర్క్‌కు మారుస్తుంటారు. అయితే ఇది వరకు మొబైల్‌ నంబర్‌ను పోర్ట్‌ పెట్టుకుంటే రెండు, మూడు రోజుల్లోనే అయిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక మొబైల్‌ నెంబర్‌ను ఇతర నెట్‌వర్క్‌కు పోర్ట్‌ పెట్టుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఎమోషనల్ అయిన హేమ.. 'మా' క్షమించేనా?

బెంగళూరులో రేవ్ పార్టీ కేసులో బెయిల్‌పై విడుదలైన నటి హేమ, తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణును కలిశారు. బెంగళూరులో రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో హేమ అరెస్టయిన తర్వాత MAA హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది.

Jobs In AP: ఏపీలో 400కు పైగా ఉద్యోగాలకు జాబ్ ఫెయిర్.. ఎప్పుడంటే?

డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో నిరుద్యోగుల కోసం జూలై 9, 2024న జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా రామచంద్రపురంలోని సిద్ధార్థ ITI కళాశాలలో జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

KCR : బాబు రీ ఎంట్రీతో భలే భలే...చూస్తుంటే బీఆర్ఎస్ కు మంచి రోజులొస్తున్నట్లే కనిపిస్తున్నాయ్‌గా

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంచి రోజులు వస్తున్నట్లే కనిపిస్తున్నాయి. కేసీఆర్ కు కష్ట సమయంలో చంద్రబాబు అనుకోకుండా ఇచ్చిన తెలంగాణలో రీ ఎంట్రీ సానుకూలంగా మారనుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

బీఎస్‌ఎన్ఎల్‌ నుంచి అదిరిపోయే ప్లాన్స్‌.. తక్కువ ధరల్లో ఎక్కువ రోజులు!

జూలై 3వ తేదీ నుంచి జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు తమ టారీఫ్‌ ప్లాన్‌ ధరలను ఒక్కసారిగా పెంచేశాయి. రీఛార్జ్‌ ధరలు భారీగా పెంచడంతో వినియోగదారులకు భారంగా మారిపోయింది. అయితే ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్ఎల్‌ మాత్రం ఎలాంటి టారీఫ్‌ ప్లాన్‌లను పెంచలేదు.

Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు స్పాట్ డెడ్

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ లో కంటైనర్ లారీని కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరికొందరికి గాయాలయ్యాయి. గాయలయిన వారిని వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళులు.. అన్నాచెల్లెళ్లు వేర్వేరుగానే

ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్‌ 75వ జయంతి వేడుకలు నేడు జరగనున్నాయి. ఇడుపులపాలయలో వైఎస్సార్ ఘాట్‌ వద్ద వైసీపీ జగన్ నివాళులు అర్పించారు వైఎస్ జగన్‌, షర్మిల కూడా ఇడుపులపాయకు చేరుకున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్ జగన్ ఘాట్‌ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు హ్యాపీ అట!!

ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ప్రజల తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే కొందరు అసలు తట్టుకోలేరు. అయితే తెలంగాణ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం ఓడిపోయినందుకు చాలా హ్యాపీ అంటూ చెబుతుండడం కొందరికి షాక్ ఇస్తోంది.

Andhra Pradesh : నేటి నుంచి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక ఇసుక ‌ఫ్రీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడుతుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటే ఇసుక విధానంలో మార్పులు తెచ్చారు. ప్రస్తుతం అదుబాటులో ఉన్న ఇసుకను ఉచితంగా తీసుకుని వెళ్లే సౌకర్యాన్ని కల్పించారు. ఇసుక మాఫియాకు తెరదించారు.

Tags:    

Similar News