15July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈదురు గాలులతో పాటు మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Update: 2024-07-15 11:32 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Hyderabad Rain: హైదరాబాదీలు బీ అలర్ట్.. నేడు కూడా భారీ వర్షమే!!

భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈదురు గాలులతో పాటు మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

State Bank Of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చిందిగా!!

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఊహించని షాక్ ఇచ్చింది. జూలై 15 నుంచి అమల్లోకి వచ్చేలా దాని బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR)ని 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. MCLRతో అనుసంధానించిన రుణాలపై SBI వడ్డీ రేట్లు కూడా పెంపు తర్వాత పెరిగే అవకాశం ఉంది.

Trump: దాడి జరిగిన కొన్ని గంటల్లోనే టీ షర్ట్స్ ను మార్కెట్ లో దింపేశారుగా!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అయితే కొన్ని గంటల్లోనే చైనీస్ రిటైలర్లు ట్రంప్ పై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలతో టీ షర్ట్స్ ను మార్కెట్ లోకి దింపేశారు.

Hussain Sagar: టెన్షన్ పెడుతున్న హుస్సేన్ సాగర్

ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నీటి మట్టాలు దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, శానిటేషన్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టిఎల్ 513.41 మీటర్లు కాగా, గరిష్ట నీటిమట్టం ఎండబ్ల్యుఎల్ 514.75 మీటర్లు.

గుడ్ న్యూస్: రుణమాఫీ మార్గదర్శకాలు వచ్చేశాయి

తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పంట రుణమాఫీ ఒకటి. ఎప్పుడు అమలు చేస్తారా అని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని..

ప్లాన్ వేసి భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడు.. ఎలా దొరికిపోయాడంటే!!

ఖమ్మం: భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి, రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయారని చిత్రీకరించిన ఫిజియోథెరపిస్ట్ బోడ ప్రవీణ్‌ను రఘునాథపాలెం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రఘునాథపాలెం వద్ద చెట్టును ఢీకొన్న కారులో ప్రవీణ్ భార్య బోడ కుమారి (26), అతని కుమార్తెలు క్రుషిక (4), థనిస్క (3) మృతి చెందారు. జూన్ 28న ప్రవీణ్ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో యూరప్ ఖండంలో తొలి శతావధానం

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో త్రిభాషా మహాసహస్రావధాని, ఏలూరు శ్రీ ప్రణవ పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 20వ శతావధానం 2024 జూలై 13వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా లండన్ నగరంలో జరిగింది. ఇది యూరప్ ఖండంలో జరిగిన తొలి శతావధానం.

YS Jagan: బెంగళూరుకు వైఎస్ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు బెంగళూరుకు వెళ్లనున్నారు. కొద్దిరోజులు ఆయన అక్కడే ఉంటారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ బెంగళూరు వెళ్లడం ఇది రెండోసారి. గత నెల 24న బెంగళూరు వెళ్లిన ఆయన ఈ నెల ఒకటో తేదీ వరకు అక్కడే ఉన్నారు.

రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు.. తీరా చూస్తే!!

కేరళకు చెందిన ఓ వ్యక్తి గత రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు. తీరా చూస్తే.. అతడు లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు. తిరువనంతపురంలోని ఒక ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చిక్కుకుపోయిన 59 ఏళ్ల వ్యక్తిని సోమవారం ఉదయం కాపాడారు. లిఫ్ట్ ఆపరేట్ వచ్చి రక్షించినట్లు పోలీసులు తెలిపారు.

అందుకే.. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటకండని చెప్పేది

ఓ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు దాటుతూ ఉండగా.. కారు ఢీకొన్న ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఫోన్ లో మాట్లాడుతూ.. హైవేను క్రాస్ చేయాలని చూసిన అతడిని కారు ఢీకొట్టడంతో ఎగిరి కిందపడిపోయాడు. కారు ఢీకొట్టడంతో కారు బానెట్‌పై పడిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్-వరంగల్ హైవేపై అన్నోజిగూడ సమీపంలో చోటుచేసుకుంది.

Tags:    

Similar News