జగన్ పాలనపై పట్టుకోల్పోయారు

ప్రజలు మంచి మార్పును కొరి జగన్ కు అవకాశం ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం ఐదేళ్ల సంగతి మాట్లాడుతున్నారని ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పాలని ఏపీ బీజేపీ [more]

Update: 2019-09-10 07:15 GMT

ప్రజలు మంచి మార్పును కొరి జగన్ కు అవకాశం ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం ఐదేళ్ల సంగతి మాట్లాడుతున్నారని ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదన్నారు. వందరోజుల్లోనే జగన్ పరిపాలనపై పట్టుకోల్పోయారన్నారు. రాష్ట్ర అభివృద్ధి క్షీణించే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం మతప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కన్నా లక్ష్మి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పటికీ ఇసుక దొరకడం లేదని కన్నా లక్ష్మినారాయణ అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని కన్నా ప్రభుత్వంపై మండిపడ్డారు

Tags:    

Similar News