గవర్నర్ ను కలసిన ఛైర్మన్
శాసనమండలి ఛైర్మన్ షరీప్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. శాసనమండలిలో జరిగిన పరిణామాలను ఆయన గవర్నర్ కు వివరించారు. శాసనమండలి ఛైర్మన్ గా తాను [more]
;
శాసనమండలి ఛైర్మన్ షరీప్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. శాసనమండలిలో జరిగిన పరిణామాలను ఆయన గవర్నర్ కు వివరించారు. శాసనమండలి ఛైర్మన్ గా తాను [more]
శాసనమండలి ఛైర్మన్ షరీప్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. శాసనమండలిలో జరిగిన పరిణామాలను ఆయన గవర్నర్ కు వివరించారు. శాసనమండలి ఛైర్మన్ గా తాను సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని రెండుసార్లు పంపితే మండలి కార్యదర్శి తనకు తిప్పి పంపారని షరీఫ్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయమని తాను రూలింగ్ ఇచ్చిన తర్వాత కూడా కార్యదర్శి పట్టించుకోవడం లేదని గవర్నర్ దృష్టికి తెచ్చారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారని షరీఫ్ తెలిపారు. ఇంతవరకూ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాకపోవడంపై కూడా ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.