పొడిగింపు తప్పేట్లు లేదు… అనుకున్నట్లుగా జరగకపోవడమే
దేశవ్యాప్తంగా లాక్ డైౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించే అవకాశాలున్నాయి. రోజురోజకూ దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణం. నిజానికి ఏప్రిల్ [more]
దేశవ్యాప్తంగా లాక్ డైౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించే అవకాశాలున్నాయి. రోజురోజకూ దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణం. నిజానికి ఏప్రిల్ [more]
దేశవ్యాప్తంగా లాక్ డైౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించే అవకాశాలున్నాయి. రోజురోజకూ దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణం. నిజానికి ఏప్రిల్ 14వ తేదీ వరకే లాక్ డౌన్ విధించారు. ఆ తర్వాత దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. తొలుత వైరస్ కంట్రోల్ లోనే ఉన్నట్లు కన్పించినా మర్కజ్ మసీదు ప్రార్థనల ద్వారా దేశంలోని 14 రాష్ట్రాలకు ఈ వ్యాధి సోకింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన జరిగే అఖిలపక్ష సమావేశంలో దీనిపై వివిధ పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ప్రకటన చేసే అవకాశముంది.