అప్పుడప్పుడు సోషల్ మీడియాలో, ప్రసంగాల్లో తత్తరపాటుకు గురై నెటిజన్లకు దోరికిపోయే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మళ్లీ అలానే ఇరుక్కుపోయారు. ఆయన గాంధీ జయంతి సందర్భంగా నిన్న ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ లో ‘సచ్చతే సేవ’ పేరుతో స్వచ్చతను పెంపొందించానికి తీసుకుంటున్న చర్యలు, చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఇందులో ఓ చోట ‘టు జెనరేట్ వేస్ట్ ఫ్రమ్ వెల్త్’ అని రాశారు. అంటే సంపద నుంచి చెత్తను ఉత్పత్తి చేస్తున్నారని అర్థం. ఇది నెటిజన్ల దృష్టిలో పడింది. దీంతో వారు ట్రోల్స్ మొదలుపెట్టారు. వాస్తవానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను లోకేష్ బాగా వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను వివరించే ప్రయత్నం బాగానే చేశారు. కానీ, ఒక చిన్న తప్పుతో అంతా రివర్స్ అయ్యింది.