బాలుడి చికిత్స కోసం భారీ విరాళం ఇచ్చిన కేఎల్ రాహుల్
కుమారుడికి చికిత్స చేయించేందుకు దాతల సహాయాన్ని కోరారు. ఈ విషయం గివ్ ఇండియా సంస్థ ద్వారా కేఎల్ రాహుల్ దృష్టికి రాగా..
బాలుడి చికిత్స కోసం భారీ విరాళం ఇచ్చిన కేఎల్ రాహుల్క్రికెటర్లు కూడా సామాజిక సేవ చేస్తారని, వారికీ దయా హృదయం ఉంటుందని చాటిచెప్పాడు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్. 11 ఏళ్ల బాలుడి చికిత్స కోసం భారీ విరాళం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వరాద్ అనే బాలుడు అత్యంత అరుదైన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఆ బాలుడికి అత్యవసరంగా ఎముక మజ్జ మార్పిడి (Bone Marrow Trasplant) శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. వరాద్ తల్లిదండ్రులకు అంత ఆర్థిక స్తోమత లేదు.
కుమారుడికి చికిత్స చేయించేందుకు దాతల సహాయాన్ని కోరారు. ఈ విషయం గివ్ ఇండియా సంస్థ ద్వారా కేఎల్ రాహుల్ దృష్టికి రాగా.. బాలుడి ఆపరేషన్ ఖర్చుల కోసం తక్షణ సహాయంగా రూ.31 లక్షలు ఇచ్చాడు. వైద్యులు ఆ బాలుడికి ఆపరేషన్ చేయగా.. సక్సెస్ అయి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. రాహుల్ ఆర్థిక సహాయం చేయడంతో.. ఆ బాలుడి తల్లిదండ్రులు అతనికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనే ముందుకు రాకపోయి ఉంటే.. ఇంత తక్కువ సమయంలో తమ కుమారుడికి సర్జరీ జరిగేది కాదన్నారు వరాద్ తల్లి.
Also Read : సికింద్రాబాద్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం
రాహుల్ చేసిన సహాయం గురించి తెలిసిన అభిమానులు రాహుల్ ను ప్రశంసిస్తున్నారు. 'Man With Golden Heart' అంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ ఐపీఎల్ సీజన్ లో రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టీ20 ఫస్ట్ మ్యాచ్ లో రాహుల్ గాయపడటంతో.. సిరీస్ కు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌కి కూడా రాహుల్ దూరంగానే ఉండాల్సిన పరిస్థితి.