Cricket Controversy : 'టైమ్డ్ ఔట్' అయిన మొదటి బ్యాటర్‌, ఏం జరిగిందో తెలుసా?

శ్రీలంక మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన ICC ప్రపంచ కప్ 2023 మ్యాచ్ నెం.38లో ఏంజెలో మాథ్యూస్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా అవుట్ అయ్యాడు.

Update: 2023-11-06 18:11 GMT

శ్రీలంక ఆల్ రౌండర్ వన్డే ప్రపంచ కప్‌లో 'టైమ్డ్ ఔట్ ' మొదటి బ్యాటర్‌గా ఊహించని రికార్డును సృష్టించాడు.

బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ సోమవారం శ్రీలంక మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన ICC ప్రపంచ కప్ 2023 యొక్క నం.38 మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా  ఔట్ అయ్యాడు. 

అస‌లు టైమ్డ్ ఔట్ అంటే ఏమిటి..?

క్రీజులో ఉన్న బ్యాట‌ర్ ఔట్ అయిన త‌రువాత వ‌చ్చే బ్యాట‌ర్ నిర్ణీత స‌మ‌యంలోగా క్రీజులోకి రాక‌పోతే కొత్త‌గా వ‌చ్చే బ్యాట‌ర్‌ను ఔట్‌గా ప్రక‌టించ‌వ‌చ్చు దీన్నే టైమ్డ్ ఔట్ అంటారు. ఎంసీసీ వన్డే ప్రపంచ కప్‌ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఓ బ్యాట‌ర్ ఔట్ అయిన త‌రువాత రెండు నిమిషాల్లోపు కొత్త‌గా వ‌చ్చే బ్యాట‌ర్ క్రీజులోకి వ‌చ్చి బంతిని ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అలా కానీ ప‌క్షంలో కొత్త‌గా వ‌చ్చే బ్యాట‌ర్‌ అంపైర్ టైమ్డ్ ఔట్‌గా ప్రక‌టించ‌వ‌చ్చు.

అసలు ఏమైంది

శ్రీలంక ఇన్నింగ్స్‌ సందర్భంగా 25 ఓవర్లో ఈ ఘటన జరిగింది. షకీబ్ ఉల్ హసన్ వేసిన ఓవర్ రెండో బంతికి సదీర సమరవిక్రమ ఔట్ అయిన తర్వాత, 134 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మ్యాథ్యూస్ బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన ఏంజెలో మొద‌టి బంతి ఎదుర్కొనేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడు. మాథ్యూస్  క్రీజులోకి వచ్చినా , హెల్మెట్ సరిగా లేకపోవటంతో మ్యాథ్యూస్ బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది.  అతని స్కూల్‌బాయ్ తప్పిదం షకీబ్ అండ్ కో సమయానికి అప్పీల్ చేయడానికి మార్గం సుగమం చేసింది.దీనిపై అంపైర్ మరైస్ ఎరాస్మస్, మ్యాథ్యూస్ టైమ్ అవుట్ అయినట్లు ప్రకటించారు.మాథ్యూస్ తన హెల్మెట్ పట్టీ విరిగిపోయినందున మొదటి బంతిని ఎదుర్కొనేందుకు అలస్యమైందని  షకీబ్‌కు  వివరించడానికి ప్రయత్నించాడు అయితే, అప్పీల్‌ను ఉపసంహరించుకునేందుకు షకీబ్ నిరాకరించాడు. దీంతో మాథ్యూస్ నిరాశ‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ప్ర‌స్తుతం మాథ్యూస్ ఔటైన విదానంపై క్రీడా వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,  అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ అరుదైన అవుట్‌ అయిన మొదటి బ్యాటర్ కూడా మాథ్యూస్. 


Tags:    

Similar News