Rain Alert : ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్
మరో నాలుగురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో నాలుగురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పిడుగులు పడే...
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచించారు. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, చెట్లు, విద్యుత్తు స్థంభాలు నేలకొరిగే అవకాశముందని తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. పశువుల కాపర్లు, రైతులు చెట్ల కింద ఉండకుండా జాగ్రత్త పడాలని తెలిపింది. భారీ వర్షాల కారణంగా అనేక జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరే అవకాశముందని పేర్కొంది.
ఏపీలోనూ...
కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలకు ఆరెంజ్ అలెర్ట్ ను, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. నిజామాబాద్ జిల్లాలోని ఎరగట్లలో అత్యధికంగా 8.71 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది