ఇది మోదీ మార్క్ డెమోక్రసీ .. ప్రధానిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

దేశాన్నంతటినీ ఒకే దృష్టితో చూడాలి కానీ.. మోదీ మాత్రం గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ పట్ల..

Update: 2022-04-22 11:30 GMT

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో అమలవుతున్నది డెమోక్రసీ కాదని, మోదీ మార్కు డెమోక్రసీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాని అంటే.. దేశాన్నంతటినీ ఒకే దృష్టితో చూడాలి కానీ.. మోదీ మాత్రం గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కు ప్రకటించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటికీ రాలేదని.. గుజరాత్ కు మాత్రం ఎల‌క్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ ప్రాజెక్టును ప్ర‌క‌టిస్తూ కేంద్రం ఇటీవలే కీల‌క ప్ర‌క‌ట‌న చేసిందని పేర్కొంటూ తెలంగాణ‌కు చెందిన రాజ‌కీయ విశ్లేష‌కుడు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు.

మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మో'డెమోక్ర‌సీ' అమ‌లులో ఉంద‌ని.. మోదీ దృష్టి మొత్తం గుజ‌రాత్ అభివృద్ధిపై ఉంద‌ని దెప్పి పొడిచారు. ఆఫ్ గుజ‌రాత్‌, బై గుజ‌రాత్‌, ఫ‌ర్ గుజ‌రాత్‌, టూ గుజ‌రాత్ అన్న సూత్రం తోనే మోదీ ప‌నిచేస్తున్నార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. పార్ల‌మెంటు సాక్షిగా వ‌రంగ‌ల్‌కు ఇస్తామ‌న్న లోకోమోటిక్ కోచ్ ఫ్యాక్ట‌రీ హామీ మోదీ తుంగ‌లో తొక్కార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.



Tags:    

Similar News