Gold Price Today: ఏడాది అంతంలో బోల్డంత ఆనందం.. బంగారం ధరలు తగ్గాయ్
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు ఎక్కువ అవుతాయనుకున్న సమయంలో అప్పుడప్పుడు ఇలా వినియోగదారులను ఊరిస్తుంటాయి. ధరలు తగ్గకపోయినా స్థిరంగా ఉంటే చాలు అదే పదివేలు అనుకునే వారు కోకొల్లలు. ఎందుకంటే ఇటీవల కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేశాయి. అసలు బంగారాన్ని సొంతం చేసుకునే అవకాశముందా? అన్న అనుమానం అనేక మందిలో బయలుదేరింది. అంతగా ధరలు పెరిగి మరీ నిరాశకు గురి చేశాయి. దీంతో వ్యాపారాలు కూడా భారీగా పడిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పెళ్లిళ్ల సీజన్ లో అతి తక్కువగా అమ్మకాలు జరిగింది ఈ సీజన్ లోనేనని వ్యాపారులు చెబుతున్నారు.
ఖర్చులు తగ్గించుకుని...
వ్యాపారాలు పడిపోవడంతో జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం కూడా ఆందోళనలో ఉంది. ఇతర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అనేక కార్పొరేట్ దుకాణాలు సయితం ప్రకటనలకు దూరంగా ఉండటానికి కారణం అమ్మకాలు పడిపోవడమేనని అంటున్నారు. నిర్వహణ ఖర్చులు కూడా తగ్గించుకునే ప్రయత్నంలో పడ్డారు దుకాణాల యాజమాన్యం. మరో వైపు కొనుగోలుదారులు అంత ధరలు వెచ్చించి కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడానికి కూడా కారణాలు అనేకం ఉన్నాయి. ఇంత పెరిగిన ధరలు ఒక్కసారిగా తగ్గితే తాము నష్టపోతామని జంకుతున్నారు. కానీ మార్కెట్ నిపుణులు మాత్రం బంగారం ధరలు ఎట్టిపరిస్థితుల్లో పడిపోవని, పెట్టుబడిలో నష్టం రావని చెబుతున్నారు.
తగ్గిందిగా...
కానీ వినియోగదారులలో నమ్మకం మాత్రం కుదరడం లేదు. బంగారం అంటే ఐశ్వర్యంగా భావించే కొందరు మాత్రమే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అదీ తమ అవసరాలకు తప్పని సరి పరిస్థితుల్లో కొనుగోలుచేసే వారు మరికొందరు. పెట్టుబడి పెట్టి బంగారంపై లాభాలు సాధించాలని ఇకొందరు మాత్రం కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,350 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,840 గా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 99,900 రూపాయలుగా ఉంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ