మోదీ నోట.. ఆ మాట... ఏపీకి ఊరట!

పార్లమెంటు పనితీరుపై ఎప్పుడు చర్చ జరిగినా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి ప్రస్తావిస్తారు. ఎన్నో వివాదాల మధ్య, ఆంధ్రప్రదేశ్ ప్రజల హాహాకారాల మధ్య, తెలంగాణ యువత ఆత్మహత్యల మధ్య... చట్టరూపం దాల్చిన ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రస్తావన లేకుండా మోదీ తన ప్రసంగాన్ని పూర్తి చేయరు.

Update: 2023-09-19 04:13 GMT

పార్లమెంటు పనితీరుపై ఎప్పుడు చర్చ జరిగినా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి ప్రస్తావిస్తారు. ఎన్నో వివాదాల మధ్య, ఆంధ్రప్రదేశ్ ప్రజల హాహాకారాల మధ్య, తెలంగాణ యువత ఆత్మహత్యల మధ్య... చట్టరూపం దాల్చిన ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రస్తావన లేకుండా మోదీ తన ప్రసంగాన్ని పూర్తి చేయరు. ఈ విషయమై భారాస సర్కారు కూడా మోదీని విమర్శిస్తూనే ఉంటుంది. తెలంగాణ ఏర్పాటుని మోదీ అవమానిస్తున్నారని మంది పడుతూనే ఉంటుంది. అశాస్త్రీయ రాష్ట్ర విభజనని ప్రస్తావిస్తూ, నాటి సోనియా నియంతృత్వ వైఖరిని మోదీ ప్రశ్నించడం... ఆంధ్రప్రదేశ్ వాసులకి ఊరట కలిగిస్తుందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా గత కాంగ్రెస్ సర్కార్ తమకు చేసిన అన్యాయం ఇప్పటికీ ఏపీ హృదయానికి  గాయం చేస్తూనే ఉంది. ఆ కోపంతోనే 2014, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు కాంగ్రెస్ కి ఒక్క  సీటు కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు.

బిజెపి హయాంలో మూడు రాష్ట్రాల విభజన జరిగినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ విభజన అంత అశాస్త్రీయంగా, దారుణంగా ఎక్కడా జరగలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎప్పటికీ తన వైఖరిని సమర్ధించుకోలేదు. నాటి మన్మోహన్ సర్కార్ తొందరపాటు చర్యల వల్ల ఇప్పటికీ ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. పార్లమెంట్లో నిన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్  ఆడ్డగోలు విభజనే ప్రస్తావించారు. అవశేష రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, నాటి కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. మెజారిటీ ఉందని అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే పార్టీలకు భవిష్యత్తు ఉండదు. కాంగ్రెస్ పార్టీ విషయంలో అదే జరిగింది. ఒక రాష్ట్ర విభజన ఎలా జరగకూడదో 2014  నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజనే బిల్లే సాక్ష్యం. 

Tags:    

Similar News