టీడీపీకి ఆ ఆలోచన లేదా? అదే కారణమా?
మునుగోడు ఉప ఎన్నిక త్వరలో జరగబోతుంది. అయినా అక్కడ పోటీ చేసేందుకు టీడీపీ నుంచి ఎవరూ ముందుకు రాలేదు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సెప్టంబరు నెలలోనే ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టాలని భావించారు. జులై నెలలో ఖమ్మం జిల్లాలో వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. అయితే సెప్టంబరులో సభ పెట్టలేదు. ఈ నెలలో పెట్టాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగే సభ ద్వారా పార్టీ సత్తాను రాజకీయ పార్టీలకు చాటి చెప్పాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారు. కానీ అందుకు ఆయన ఇంకా తేదీలను తెలంగాణ నేతలకు ఇవ్వలేదు. తెలంగాణలో పార్టీ బలంగా లేదని చంద్రబాబుకు తెలియంది కాదు. అయితే హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం ఉంది. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కనీస ఓట్లను సాధిండమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పార్టీకి ఇప్పటికీ ఓటు బ్యాంకు చెదరలేదన్న విశ్వాసంతో ఉన్నారు.