అలా చేస్తేనే రాయలసీమకు నీరు.. తర్వాత పోతిరెడ్డి పాడు

కేసీఆర్ ప్రకటన అభినందనీయమని సీనియర్ నేత మైసూరా రెడ్డి అన్నారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకెళ్లమని కేసీఆర్ చెప్పడం స్వాగతించాల్సిన అంశమన్నారు. గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించి [more]

Update: 2020-05-23 05:54 GMT

కేసీఆర్ ప్రకటన అభినందనీయమని సీనియర్ నేత మైసూరా రెడ్డి అన్నారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకెళ్లమని కేసీఆర్ చెప్పడం స్వాగతించాల్సిన అంశమన్నారు. గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించి అక్కడి నుంచి రాయలసీమకు తరలించాలని మైసూరా రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయలసీమకు నీళ్లు రావాలటే గోదావరి జలాలు మాత్రమే శరణ్యమని మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ చెప్పినట్లు గోదావరి నదిలో మిగిలిపోయిన వెయ్యి టీఎంసీలను వినియోగించుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను తొలుత పూర్తి చేయాలని మైసూరారెడ్డి కోరారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీటికేటాయింపులు చేస్తూ చట్టబద్దమైన అవకాశం కల్పించాలన్నారు. పంటకాల్వలను యుద్ధ ప్రాతిపదికపైన పూర్తి చేస్తే రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు. ఆ తర్వాతనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చూసుకోవచ్చాని మైసూరారెడ్డి తెలిపారు. ఈ మేరకు రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట జగన్ కు లేఖ రాశారు.

Tags:    

Similar News