వాటర్ బాటిల్ వెనక్కు తిరగడం వల్లనే నందమూరి హరికృష్ణ ప్రమాదానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో కారు 160 కిలో మీటర్లు వేగంతో ప్రయాణం చేస్తుంది. దీనితో పాటుగా రోడ్డు మలుపు వుండడం గమనించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణ లో బయట పడింది. సీట్ బెల్డ్ పెట్టుకొక పొవడంతో హరికృష్ణ ప్రాణాలు పోయాయని పోలీసులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి సమగ్ర విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది అన్న దాని పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు 2323 ఈ ప్రమాదానికి కారణమైంది.
సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ.....
హరికృష్ణ డ్రైవ్ చేస్తున్న వాహనం అసలు ఎలా ప్రమాదానికి కు గురైంది? అసలు ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? అన్న దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. నెల్లురు లోని కావలి లో ఒక మిత్రుడి ఇంట్లో వివాహం. ఈ వివాహానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు హరికృష్ణ. అయితే బుధవారం ఉదయం పది గంటల సమయంలో వివాహం.. ఇందుకు గాను ఉదయం సమయంలోనే హైదారబాద్ నుంచి బయలు దేరి వెళ్లాలని అనుకున్నారు. తన మిత్రులైన అరికెపూడి శివాజీ, వెంకటరావులను తీసుకుని బుధవారం ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో మెహదీపట్నంలోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఇంటి నుంచి బయలు దేరినప్పటి నుంచి కారును హరికృష్ణ నడుపుతున్నారు.హైవే మీదకు వెళ్లిన తర్వాత కారు కనీసం 120 నుంచి 160 మైళ్ల వేగంతో వెళుతుంది. ప్యార్చూనర్ కారులో ముగ్గురు మిత్రులు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ పొతున్నారు.
ముచ్చట్లు చెబుతూ.....
కారు నార్కేట్ పల్లి దాటింది. తరువాత అన్నెపర్తి పోలీస్ బెటాలియన్ కు సమీపంలోకి కారు వెళ్లుతున్న సమయంలోనే హరికృష్ణ తన వెనుక సీట్ లో వున్న వెంకట రావును మంచినీళ్లు బాటిల్ కావాలని అడిగాడు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉన్న హరికృష్ణ వెనుకకు తిరిగి మంచినీళ్లు బాటిల్ ను అడిగాడు. ఇంతలో రోడ్డు ఒక్కసారిగా ఎడమ వైపుకు తిరిగింది. దీంతో కంగారు పడిన హరికృష్ణ తన కారును వెంటనే కుడి వైపు కు తిప్పాడు. దీంతో కారు అదుపు తప్పింది. ఒక్కసారిగా ఎదురు రోడ్డులోకి వెళ్లిపొయింది. ఎదురుగా వస్తున్న ఒక కారును డికొట్టి ప్రక్కనే వున్న చిన్న పాటి కల్వర్టును ఢీకొంది.. సీట్ బెల్ట్ లేక పొవడం మూలంగా హరికృష్ణ డోర్ ఒక్కసారిగా తెరుకుంది. దీంతో ఆయన కారులోనుంచి వేగంగా కిందకు పడిపోయారు. నేరుగా రాళ్లమీద పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగినప్పడు ఉదయం ఆరు గంట ఐదు నిమిషాలు అయ్యింది. ప్రమాదం జరగడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతొ బెటాలియన్స్ లో వున్న పోలీసులతో పాటుగా పక్క గ్రామంలో వున్న స్దానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అక్కడ రక్తం మడుగులో కొట్టు మిట్టాడుతున్న హరికృష్ణను వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హరికృష్ణ మృతిచెందాడు. ఇందులో కారు 160 కిలో మీటర్లు వేగంతో వుండడంతో అదుపు తప్పందని పోలీసులు తేల్చారు.