చంద్రబాబు ఫుల్లు హ్యాపీస్....వై....!

Update: 2018-08-23 03:30 GMT

ఎపి సిఎం చంద్రబాబు చాలా తృప్తిగా ఉన్నారట. ఎందుకంటే ఆయన గత నాలుగేళ్ళలో చేసిన పనులు వేసిన అడుగులు ఈ తృప్తిని కలగచేశాయిట. వేరెవరో ఈ మాటలు చెప్పడం లేదు. స్వయంగా ఆయనే ప్రకటించేశారు. గతంలో ఎన్నడూ లేనంత తృప్తిగా ఈసారి వుంది అంటున్నారు బాబు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు వున్నా ఎప్పుడూ ఇంత సంతృప్తిని చంద్రబాబు వ్యక్తం చేయకపోవడం గమనార్హం. అయితే నాలుగున్నరేళ్లలో ఏపీ ముఖచిత్రాన్నే మార్చేశానంటున్నారు.

ప్రతి ఊరి సమస్య తీర్చా ....

ఎప్పుడన్నా గ్రామ స్థాయిలో సిమెంట్ రోడ్లు, వీధిలైట్లు, డ్రైన్లు ఉండటం చూశామా ఇవే కాదు అన్ని రకాల సమస్యలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించినట్లు ప్రచారం మొదలు పెట్టారు చంద్రబాబు. వాస్తవానికి అధికారంలో వున్న వారు ఇలాంటి పాజిటివ్ క్యాంపైన్ చేయడం సహజమే. ఇందులో సిద్ధహస్తులు టిడిపి చీఫ్. ఇప్పటికే నిత్యం ఆయన సర్వేలు చేయిస్తున్నారు. ఐవి ఆర్ ఎస్ విధానంలో ప్రభుత్వ పాలన పై జనాభిప్రాయాన్ని కోరుతున్నారు.

అఫిషియల్ ఫీడ్ బ్యాక్ తో.....

అవే కాకుండా గ్రామదర్శిని, నగరదర్శని వంటి కార్యక్రమాలతో నేతలను ప్రజలతో మమేకం చేస్తున్నారు. ఇవన్నీ లెక్కేసుకునే చంద్రబాబు సంతృప్తి మంత్రం పఠిస్తున్నారు. అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా చంద్రబాబుకు అనుకూలంగానే అందుతోంది. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా గ్రామాల పరిస్థితే మరిపోయిందని చెబుతుండటంతో ఏపీ పల్లెలు వికసించాయని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన అభివృద్ధిని గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. చూడాలి ఆయన మంత్రాలకు ఓట్లు రాలతాయో లేదో.

Similar News