శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు. వరద సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రంలోగా కొన్నిప్రాంతాలకు కరెంటు సరఫరా చేస్తామని చంద్రబాబు చెప్పారు. పంటనష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. జీడితోటల పెంపకానికి ఎకరానికి నలభై వేలు ఇస్తామని చెప్పారు. రేషన్ సరఫరాలో తేడా వస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ముద్దులుపెట్టే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ అని చంద్రబాబు ప్రశ్నించారు. పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్న జగన్ కు వరద బాధితులను పరామర్శించే తీరికలేదా? అని ప్రశ్నించారు. కేంద్రం వరద సాయం పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.