బాబుకు 18 ప్రశ్నలు....?

Update: 2018-11-08 06:16 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకోవడానికే చూశారని హరీశ్ రావు ఆరోపించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తుపెట్టుకుంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టీ తెలంగాణలో పోటీ చేసే నైతిక హక్కు లేదన్నారు హరీశ్ రావు.

01. ఎవరి అనుమతితో టీటీపీ కొత్త ప్రాజెక్టులను కడుతుంది.

02. సీలేరు ప్రాజెక్టు తీసుకున్నందువల్ల తెలంగాణకు ఏడాదికి రూ.500 కోట్ల నష్టం రాలేదా?

03. ఆంధ్ర విద్యుత్తు ఉద్యోగులను తీసుకోకుండా మోసం చేయలేదా?

04. కల్వకుర్తిపై కుట్రలు చేస్తుంది నిజం కాదా?

05. శ్రీశైలం నుంచి తెలంగాణకు నీళ్లివ్వొద్దనడం నిజం కాదా?

06. కాళేశ్వరం పై విషం చిమ్మడం మీ దుష్టపన్నాగం కాదా?

07. పోలవరానికి బదులుగా కృష్ణాకు నీళ్లివ్వడం నాటకం కాదా?

08. విద్యుత్తు ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయాలేదా?

09. ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వకుండా కరెంట్ టెండర్లలో పాల్గొనడం కుట్రకాదా?

10. హైదరాబాద్ ఆస్తుల్లో వాటా కోరడం దురాశ కాదా?

11. నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలనుకోవడం నిజం కాదా?

12. పాలేరుకు నీళ్లివ్వడం కూడా పాపమేనా?

13. పోలవరం ముంపు మండలాలను గుంజుకోవడం నిజంకాదా?

14. హైదరాబాద్ లో భవనాలు ఖాళీచేసినా మాకు అప్పగించకపోవడం సంకుచితం కాదా?

15. కేసీ కెనాల్ కోసం తుమ్మిళ్ల వద్దంటారా?

16. విభజన మానని గాయం అని మీరు బాధపడలేదా?

17. పాలమూరులో ఎత్తిపోతల పథకాన్ని కడతామని మీరు హామీ ఇవ్వలేదా?

18. అలాంటి మీకు ఎందుకు ఓటు వేయాలి.

Similar News