చరిత్ర సృష్టిద్దామని విఫలమయ్యా కానీ?
తానేమీ తండ్రిపేరు చెప్పుకుని బతికేవాడిని కానని, తాను తండ్రి నియోజకవర్గంలో పోటీ చేయలేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జగన్ పై ఆయన విమర్శలు చేశారు. [more]
తానేమీ తండ్రిపేరు చెప్పుకుని బతికేవాడిని కానని, తాను తండ్రి నియోజకవర్గంలో పోటీ చేయలేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జగన్ పై ఆయన విమర్శలు చేశారు. [more]
తానేమీ తండ్రిపేరు చెప్పుకుని బతికేవాడిని కానని, తాను తండ్రి నియోజకవర్గంలో పోటీ చేయలేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జగన్ పై ఆయన విమర్శలు చేశారు. తాను కుప్పంలో కాకుండా మంగళగిరిలో పోటీ చేసి చరిత్ర సృష్టిద్దామనుకుని విఫలమయ్యాయని నారా లోకేష్ చెప్పారు. హెరిటేజ్ పై జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, హెరిటేజ్ ఫ్రెష్ ను తాము ఎప్పుడో అమ్మేశామన్నారు. అందులో తమకు షేర్లు మాత్రమే ఉన్నాయని నారా లోకేష్ తెలిపారు. జగన్ కు ఎన్నో కంపెనీల్లో షేర్లు ఉన్నాయని, వాటిల్లో ధర పెరిగితే అందుకు జగన్ బాధ్యత వహిస్తారా? అని నారాలోకేష్ ప్రశ్నించారు. తాను అమెరికాలో చదువుకున్నానని, తెలుగు మాట్లాడటంలో తప్పులు దొర్లి ఉండవచ్చని, అంతమాత్రాన విమర్శిస్తారా? అని నిలదీశారు. తన తెలుగు భాష కారణంగా ఏపీ నష్టపోయిందా? అని ప్రశ్నించారు. తనపై అసెంబ్లీలో మాట్లాడుతున్న నేతలు శాసనమండలిలో మాత్రం కిమ్మనడం లేదన్నారు. రాజధానిలో అవినీతి జరిగితే ఎందుకు ఇప్పటి వరకు వెలికితీయలేదన్నారు నారా లోకేష్. ఆర్టీసీ ఛార్జిల పెంపునకు నిరసనగా మంగళగిరి నుంచి అసెంబ్లీ వరకూ లోకేష్ బస్సులో ప్రయాణించారు.