జగన్ కు లోకేష్ లాస్ట్ వార్నింగ్

కరోనా కు భయపడి కేబినెట్ మీటింగ్ ను వాయిదా వేసుకున్న జగన్ విద్యార్థుల కోసం పరీక్షలు మాత్రం వాయిదా వేయడం లేదని నారా లోకేష్ ఆరోపించారు. లక్షలాది [more]

Update: 2021-04-30 00:58 GMT

కరోనా కు భయపడి కేబినెట్ మీటింగ్ ను వాయిదా వేసుకున్న జగన్ విద్యార్థుల కోసం పరీక్షలు మాత్రం వాయిదా వేయడం లేదని నారా లోకేష్ ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు పరీక్షలంటేనే భయపడిపోతున్నారన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలు రాయాలా? అని లోకేష్ ప్రశ్నించారు. పదిహేను లక్షల మంది విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని వెంటనే పరీక్షలు వాయిదా వేయాలని లోకేష్ కోరారు. వారికి వైరస్ సోకితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చివరి సారిగా లోకేష్ హెచ్చరించారు.

Tags:    

Similar News