కర్ణాటకలో నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు

కర్ణాటకలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కేసు నమోదయింది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘటనపై అనవసరంగా ఎలాంటి సంబంధం లేనప్పటికీ కూడా రాజకీయ [more]

Update: 2021-05-09 01:00 GMT

కర్ణాటకలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కేసు నమోదయింది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘటనపై అనవసరంగా ఎలాంటి సంబంధం లేనప్పటికీ కూడా రాజకీయ దురుద్ధేశంతో, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రా రెడ్డికి అంటగట్టి వారిని నిందిస్తూ, వార్నింగ్ లు ఇస్తూ, ట్విట్టర్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ లు పెట్టారని నారా లోకేష్ పై ఫిర్యాదు అందింది. కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగిస్తూ ఆయనపై ప్రజలలో వ్యతిరేకత ద్వేషం కలిగిస్తూ వైసీపీకి కి రాజకీయంగా నష్ట పరచడానికి కుట్రపన్నినట్లు ఫిర్యాదు అందింది. దీంతో నారా లోకేష్ పై డి.హిరేహాళ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్.111/2021 అండర్ సెక్షన్ ఐ.పి.సి 153(A),505 and 506 గా కేసు నమోదయింది

Tags:    

Similar News