వెళ్లాలా....? వద్దా...?

Update: 2018-09-15 10:34 GMT

మహారాష్ట్రలోని కోర్టుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంతనాలు జరుపుతున్నారు. 2008లో బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బృందాన్ని అప్పటి ప్రభుత్వం అడ్డుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుతో పాటు మరికొందరిపై నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. ఈనెల 21వ తేదీలోగా కోర్టుకు హాజరుకావాలని చెప్పింది. అయితే హాజరుకాకుంటే కోర్టు థిక్కారం కిందకు వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

హాజరయితే.....

కోర్టుకు హాజరయి వెంటనే బెయిల్ తెచ్చుకోవచ్చన్నది న్యాయనిపుణుల సూచన. అయితే మరికొందరు మాత్రం న్యాయమూర్తి బెయిల్ నిరాకరిస్తే ఏంచేస్తారన్న అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు సోమవారం మరోసారి న్యాయ నిపుణులతోనూ, టీడీపీ సీనియర్ నేతలతోనూ, నోటీసులు అందుకున్న టీడీపీ నేతలతోనూ సమావేశమై ధర్మాబాద్ కోర్టుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. పార్టీ నేతలు మాత్రం కోర్టుకు హాజరవ్వడమే మంచిదని, దానివల్ల తెలంగాణలో పార్టీకి మైలేజీ వస్తుందని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Similar News