తెలంగాణాలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుందని నరేంద్ర మోదీ చెప్పారు

Update: 2022-07-03 14:02 GMT

2019 ఎన్నికల నాటి నుంచే బీజేపీ తెలంగాణలో బలపడుతుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుందని చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం బీజేపీ పనిచేస్తుందని చెప్పారు. కరోనా కష్ట సమయంలో తెలంగాణ ప్రజల కోసం ఎంతో చేశమన్నారు. ఉచిత రేషన్, వ్యాక్సిన్ ను అందించామని చెప్పారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. బీజేపీ జెండా ఎగిరిందన్నారు. తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందని చెప్పారు.

హైదరాబాద్ లో సైన్స్ సిటీ...
డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని మోదీ అన్నారు. బడుగులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేకం అందుతున్నాయని చెప్పారు. ప్రతిభకు హైదరాబాద్ పట్టం కడుతుందని చెప్పారు. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్థినిస్తుందని చెప్పారు. హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. తెలుగులో టెక్నాలజీ, మెడికల్ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి అని మోదీ సభలో జనాల హర్షధ్వనాల మధ్య ప్రకటించారు.
అభివృద్ధి పనులన్నీ....
మహిళ సాధికారికత దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని మోదీ తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామన్నారు. దీంతో దేశంలో ఎరువుల కొరత తీరుతుందని చెప్పారు. రైతుల ప్రయోజనాలను ఈ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పారు. కనీస మద్దతు ధరలను పెంచామన్నారు. హైదరాబాద్ లో 1500 కోట్లతో ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నామని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్లు కూడా కేటాయించామని మోదీ తెలిపారు. తెలంగాణలో ఐదువేల కిలోమీటర్ల నేషనల్ హైవే లు అభివృద్ధి చేశామని చెప్పారు. ఐదు నీటి ప్రాజెక్టుల కోసం కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. తెలంగాణలో టెక్స్‌టైల్ పార్కును నిర్మించనున్నామని, దీని వల్ల ఎందరికో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయనిచెప్పారు.


Tags:    

Similar News