పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించినా అయోధ్య లో రామమందిరం నిర్మించుకోలేక పోయాం. ప్రజల్లో రామాలయం ఎందుకు కట్టలేదు అంటే సమాధానం చెప్పు కోలేక పోతున్నాం. ఇక న్యాయస్థానాలు అయోధ్య వివాదం ఇప్పట్లో తేల్చవని అర్ధం అవుతుంది. మరి కిం కర్తవ్యం. వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లోకి సెంటిమెంట్ ఆధారంగానే ఎన్నికలకు వెళ్ళాలి అని సీరియస్ గా బిజెపి సర్కార్ కి హెచ్చరిక జారీ చేస్తున్నాయి విశ్వహిందూ పరిషత్తు , ఆర్ఎస్ఎస్. రామజన్మ భూమి అంశం మరోసారి తెరపైకి తేవడం ద్వారానే మోడీ సర్కార్ మనుగడ ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తుంది ఆర్ఎస్ఎస్. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది.
మరోసారి ఉద్యమానికి ...
రాముడు జన్మించిన ప్రాంతంలో ఎట్టిపరిస్థితుల్లో ఆలయం నిర్మించాలని ఎన్నిల ముందు శంఖారావం పూరించింది విశ్వహిందు పరిషత్తు. అందుకోసం దేశవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయడంతో పాటు కీలక ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తుంది. ఒక పక్క ప్రజల దృష్టి ని ఆకర్షించాలి. మరోపక్క కేంద్రంలోని మోడీ సర్కార్ పై గట్టి పోరాటం సాగించాలి. ఇదే ప్రణాళికతో విహెచ్ పి , సంఘ్ కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాయి మోడీ సర్కార్ పదవీకాలం పూర్తి అయ్యేలోగా పార్లమెంట్ వేదికగా పరిష్కారం చూపించాలని అల్టిమేటం జారీ చేయడంతో రామ జన్మభూమి అంశం వచ్చే ఎన్నికల నాటికి ఉండకూడని సంఘ్ ఆలోచన. మరి దీనికి కేంద్రంలోని మోడీ సర్కార్ ఎంత వరకు మద్దతు పలుకుతుంది అన్నది చూడాలి.