చౌ చౌ మ్యాచ్... ఇంత చప్పగానా?
న్యూజిలాండ్ - భారత్ మ్యాచ్ చప్పగా ముగిసింది. న్యూజిలాండ్ 108 పరుగులకే ఆల్ అవుట్ కావడంతో భారత్ ముందు లక్ష్యం చిన్నదయింది
న్యూజిలాండ్ - భారత్ మ్యాచ్ చప్పగా ముగిసింది. న్యూజిలాండ్ 108 పరుగులకే ఆల్ అవుట్ కావడంతో భారత్ ముందు లక్ష్యం చిన్నదయింది. దీంతో భారత్ లక్ష్యసాధనకు పెద్దగా కష్పపడలేదు. రోహిత్ శర్మ అర్థశతకం పూర్తి చేసుకుని ఎల్‌బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. విరాట్ కొహ్లి తక్కువ పరుగులే అవుటయ్యాడు. దీంతో ఇషాన్ కిషన్, శుభమన్ గిల్ నిలకడగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు. రాయపూర్ మ్యాచ్ చౌ చౌగా ముగిసింది.
గెలుపును ముందే...
ఎలాంటి ఉత్కంఠత లేదు. హైదరాబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ భారీ పరుగులు చేసినా మ్యాచ్ చివరి బాల్ వరకూ ఉత్కంఠ కొనసాగింది. కానీ రాయపూర్ మ్యాచ్ లో మాత్రం గెలుపు ముందే డిసైడ్ అయిపోయింది. భారత్ నెగ్గడం సులువని తేలిపోయింది. ఇంకా ఓవర్లు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ను ఇంటి దారి పట్టించారు. సిరీస్ భారత్ పరమయింది. మిగిలిన ఒకే ఒక మ్యాచ్ నామమాత్రంగా మారింది. పరువు నిలుపుకునేందుకు న్యూజిలాండ్ ఈ నెల 24న జరగబోయే చివరి వన్డేలో కష్టపడాల్సి ఉంటుంది. 20 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు. శుభమన్ గిల్ నలభై పరుగులు చేశాడు