సీఎం ఫొటోలను తొలగించండి… నిమ్మగడ్డ ఆదేశం

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ కు లేఖ రాశారు. కుల, ఎన్ఓసీ పత్రాలను తాహసిల్దార్లు వెంటనే జారీ చేసేలా [more]

Update: 2021-01-29 05:10 GMT

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ కు లేఖ రాశారు. కుల, ఎన్ఓసీ పత్రాలను తాహసిల్దార్లు వెంటనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కుల ధృవీకరణ పత్రాలు, ఎన్వోసీలపైన ముఖ్యమంత్రి జగన్ ఫొటో తొలగించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. అలాగే కుల ధృవీకరణ పత్రాలు, ఎన్వోసీ ల విషయంలో వివక్ష లేకుండా చూడాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News