వైఎస్సార్ వల్లనే ఈ స్థాయిలో ఉన్నానన్న నిమ్మగడ్డ

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించారు. ఏకగ్రీవాలు మొత్తాన్ని తాను తప్పుపట్టడం లేదని నిమ్మగడ్డ తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల [more]

Update: 2021-01-30 06:00 GMT

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించారు. ఏకగ్రీవాలు మొత్తాన్ని తాను తప్పుపట్టడం లేదని నిమ్మగడ్డ తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల వైఎస్సార్ కు ఎంతో గౌరవం ఉండేదన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి వైఎస్సార్ కారణమన్నారు. నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను అధికారులకు వైఎస్సార్ ఇచ్చేవారన్నారు. ఏకగ్రీవాలకోసం వత్తిడి చేసేవారిని ఇంటికే పరిమితం చేస్తామన్నారు. బలవంతపు ఏకగ్రీవాలపై నిఘా ఉందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో పోటీతత్వం ఉందడాలన్నరు. ఏకగ్రవాలన్నీ తప్పు అని తాను అనడం లేదన్నారు. రాజ్యంగాం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పనిచేసే వారిపై ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయని నిమ్మగడ్డరమేష్ కుమార్ తెలిపారు. తాను ఎవరి ఆశీస్సులతోనో ఎస్ఈసీ కాలేదని నిమ్మగడ్డ రమే‌ష్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News