నేను ఎవరినీ కించపర్చలేదన్న నిమ్మగడ్డ

ఏ ఒక్కరిని తాను కించపర్చేలా మాట్లాడలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష‌ కుమార్ తెలిపారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్ [more]

Update: 2021-02-02 04:01 GMT

ఏ ఒక్కరిని తాను కించపర్చేలా మాట్లాడలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష‌ కుమార్ తెలిపారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్ చెబుతుందన్నారు. ఏకగ్రీవాలకు తాము వ్యతిరేకం కాదని, బలవంతపు ఏకగ్రీవాలను మాత్రం వద్దంటున్నామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. ఎవరిని వ్యక్తిగతంగా తాను విమర్శలు చేయలేదన్నారు. అందరినీ సమానంగా చూస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ఎన్నికలను విజయవంతం చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News