బ్యాంకులకు రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాకు భారీ మద్దతు లభించింది. విజయ్ మాల్యాను దొంగ అనడం సరికాదని ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చెప్పడం ఆసక్తికరంగా మారింది. టైమ్స్ సంస్థ ముంబయిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన నితిన్ గడ్కరి... విజయ్ మాల్యా అంశాన్ని ప్రస్తావించారు. 40 ఏళ్లుగా సమయానికి వడ్డీలు కడుతున్న మాల్యా ఇప్పుడు ఒక్కసారి కట్టకపోతే ఆయనను దొంగ అనడం సరికాదని పేర్కొన్నారు. వ్యాపారం అన్నా ఒడిదొడుకులు ఉంటాయని, 40 ఏళ్లు బాగా ఉన్న మాల్యా ఏవియేషన్ రంగంలోకి వచ్చాక ఇబ్బందుల్లో పడ్డారన్నారు. తనకు విజయ్ మాల్యాతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవని ఆయన పేర్కొన్నారు.