నిజామాబాద్ బరిలో 185 మంది
వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకొని జీవిస్తున్న రైతన్న కడుపు మండింది. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వలేని ప్రభుత్వాలపై ఎన్నికలను ఆయుధంగా చేసుకొని పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఎర్రజొన్న, పసుపు [more]
వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకొని జీవిస్తున్న రైతన్న కడుపు మండింది. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వలేని ప్రభుత్వాలపై ఎన్నికలను ఆయుధంగా చేసుకొని పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఎర్రజొన్న, పసుపు [more]
వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకొని జీవిస్తున్న రైతన్న కడుపు మండింది. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వలేని ప్రభుత్వాలపై ఎన్నికలను ఆయుధంగా చేసుకొని పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఎర్రజొన్న, పసుపు రైతులు తమను ఆదుకోవాలని చాలాకాలంగా నిరసనలు తెలుపుతున్నారు. రోడ్డెక్కి ధర్నాలు చేశారు. అయినా వారి సమస్య తీరలేదు. ఇంతలో ఎన్నికలు రావడంతో నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఏకంగా 170 మందికి పైగా రైతులు నామినేషన్లు వేశారు. పెద్ద సంఖ్యలో రైతులు నామినేషన్లు వేయడంతో ఏకంగా 189 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిపోగా కేవలం నలుగురు మాత్రమే నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దేశంలోనే ఒకే స్థానానికి ఎక్కువ మంది పోటీ పడుతున్న స్థానం ఇదే కావచ్చు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. కాగా, నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవితకు ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది.